ఆంధ్రప్రదేశ్‌

బుర్రిపాలెంలో శ్రీమంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మే 8: సినీ హీరో మహేష్‌బాబు తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో ఆదివారం పర్యటించారు. తాను దత్తత తీసుకున్న ఈ గ్రామంలో 2.16కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మహేష్‌బాబు మాట్లాడుతూ తన తాత, నాయనమ్మ, అమ్మ, నాన్నల స్వగ్రామం తనకు సొంత గ్రామమేనన్నారు. తాను శ్రీమంతుడు సినిమా తీసే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని తన బావ, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ సలహా ఇచ్చారని, అయితే సినిమా రిలీజ్ అయిన తరువాత తీసుకుంటానని చెప్పానని మహేష్ తెలిపారు. ఆ తరువాత తన భార్య నమ్రత బుర్రిపాలెం సందర్శించిందనీ చెప్పారు. దత్తత గ్రామాభివృద్ధిలో భాగంగా మొదటి దశగా గ్రామస్థులకు సిద్దార్థ కళాశాల విద్యార్థుల బృందం, ఆంధ్రా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ప్రాథమిక వైద్య సేవలు, తన నాయనమ్మ కట్టించిన ఘట్టమనేని నాగరత్నమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధిలో భాగంగా విద్యకు ప్రాధాన్యత నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్లు, మురుగు కాలువలు, ప్రైమరీ వైద్య సేవల అమలుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణలో తాను దత్తత తీసుకున్న సిద్దాపూర్‌కు ఈ నెల 15న వెళ్ళనున్నట్లు తెలిపారు.
ఎంపి గల్లా జయదేవ్ మాట్లాడుతూ మహేష్‌బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకోవటం హర్షణీయమని, గ్రామం అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు చేయూతనిస్తానని చెప్పారు. అనంతరం కౌలురైతులకు గుర్తింపు కార్డులు, చిన్నారులకు బహుమతులు, డ్వాక్రా మహిళలకు కోటి రూపాయల విలువగల బ్యాంకు రుణాల చెక్‌ను, పేదలకు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీచేసి త్వరలోనే మారోమారు గ్రామం వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

చిత్రం... బుర్రిపాలెంలో విలేఖరులతో మాట్లాడుతున్న
హీరో మహేష్‌బాబు