ఆంధ్రప్రదేశ్‌

హెరిటేజ్ చేతికి సర్కారు మజ్జిగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 8: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ నిర్వహణలో ఉన్న హెరిటేజ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న చలివేంద్రాలకు మజ్జిగ సరఫరా చేసే బాధ్యతను సొంతం చేసుకుంది.
వేసవికాలం దృష్ట్యా రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ చలివేంద్రాలు ఏర్పాటుచేసి, అక్కడ మజ్జిగ ప్యాకెట్లను అందచేయాలని క్యాబినెట్‌లో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు జిల్లాకు 3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఆయా జిల్లాల అవసరాలను బట్టి పెరుగు ప్యాకెట్లు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. ఆ సరఫరా వ్యవహారాన్ని హెరిటేజ్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లకు వాటి సరఫరా, నిధుల కేటాయింపు అధికారాలు కట్టబెట్టింది. ఆ మేరకు తాజాగా జిల్లా కలెక్టర్లు అన్ని మండల తహశీల్దార్లకు వౌఖిక ఆదేశాలిచ్చారు. విజయనగరం జిల్లా కలెక్టర్ పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రాపురం, సాలూరు, దత్తిరాజేరు, గజపతినగరం, గరివిడి, చీపురుపల్లి మండల తహశీల్దార్లకు లేఖ నెంబర్ 676/2016/డి5తో లేఖ రాశారు.
రాష్ట్రంలో పెరుగుతున్న వడగాలుల నేపథ్యంలో, చలివేంద్రాల ద్వారా మజ్జిగ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తమ లేఖలో పేర్కొన్నారు.
మీ అవసరాలను బట్టి 20 నుండి 30 లీటర్ల పెరుగు ప్యాకెట్లు తీసుకుని, మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన చలివేంద్రాలకు సరఫరా చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రతి చలివేంద్ర కేంద్రంలో ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సహకారంతో మజ్జిగ పంపిణీ’ అనే బ్యానర్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు.
ఆ మేరకు ప్రతి మండల తహశీల్దార్లు హెరిటేజ్ సంస్థకు లేఖ రాసి పెరుగు తెప్పించుకోవాలని, వాటి ఖర్చును జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి చెల్లిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రతి రోజు చలివేంద్రాలకు ఎంత పెరుగు సరఫరా చేస్తున్నారో, వాటి పంపిణీ వివరాలు తెలియచేయాలని ఆదేశించారు. మొత్తం 13 జిల్లాల్లో జిల్లాకు 3 కోట్లు చొప్పున 39 కోట్ల రూపాయలు హెరిటేజ్ సంస్థకు చెల్లించనున్నారు.
కాగా, లోకేశ్ టిడిపి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించకముందు హెరిటేజ్ వ్యవహారాలు చూసుకోగా, ప్రస్తుతం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్ సతీమణి ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.