ఆంధ్రప్రదేశ్‌

‘కాగ్’తోన్న పట్టిసీమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 17: ‘పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణాలోకి పరవళ్ళు తొక్కుతున్నాయి..పట్టిసీమ వల్ల ఈ ఏడాది కృష్ణా ఆయకట్టులో ముందస్తు ఖరీఫ్ సాధ్యపడింది..పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణాకు తోడటం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి దాదాపు రూ.7500 కోట్ల విలువైన పంటల ఆదాయం సాధించాం... ఇంత ప్రయోజనం కలిగిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఆరోపణలు తగదు’ ఇది అధికార పక్షం ప్రజా ప్రతినిధుల వాదన. ‘పట్టిసీమ దండగ పథకం, దీనిపై కాగ్ అక్షింతలు వేసింది. అదనపు నిధులు చెల్లించారని తప్పు పట్టింది...’ ఇది విపక్షాల వాదన. ఈ ఆరోపణలతో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన సవాల్‌కు ప్రతి సవాల్‌గా టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చర్చకు సిద్ధమని ప్రకటించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18న కృష్ణా బ్యారేజి వద్ద రైతుల సమక్షంలో చర్చకు సిద్ధమని గోరంట్ల ప్రకటించడం, దానికి ఉండవల్లి ఓకే చెప్పడం జరిగిపోయాయి. వారి సవాల్ ప్రకారం మంగళవారం చర్చ జరగాల్సివుంది. కాగ్ నివేదిక ఆధారంగానే ఉండవల్లి ప్రశ్నలను సంధించడానికి సన్నద్ధమవుతుంటే, అందుకు దీటుగా రైతులతోనే సమాధానం చెప్పించడానికి అధికారపక్షం సమాయత్తమైనట్టు తెలుస్తోంది. అయితే శాంతిభద్రతల దృష్ట్యా కృష్ణా బ్యారేజి వద్ద చర్చకు పోలీసు శాఖ అనుమతిస్తుందా అనేది స్పష్టం కావాల్సివుంది. ఇటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అటు మాజీ ఎంపి అరుణ్‌కుమార్ కూడా సై అంటే సై అన్నట్టుగా ఎవరి ఏర్పాట్లు వారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నాళ్ళ నుంచో చర్చకు రమ్మంటుంటే, ఇంతవరకు ఎవరూ స్పందించలేదని అనుకుంటోన్న తరుణంలో మాజీ ఎంపి ఉండవల్లికి గోరంట్ల స్పందన మంచి సదవకాశంగా లభించినట్టుగా చెబుతున్నారు. పట్టిసీమ ప్రయోజనమేమిటో అధికారికంగానే కాకుండా రైతుల నుంచే చెప్పిస్తామనే ధీమాతో గోరంట్ల సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. పట్టిసీమ పధకం ద్వారా రూ. 391 కోట్లు అదనపు చెల్లింపులు జరిగాయని కాగ్ నివేదికలో పేర్కొన్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. దీనిపైనే ఉండవల్లి అరుణ్‌కుమార్ తన మొదటి ప్రశ్న సంధించనున్నట్టు ఇప్పటికే స్పష్టం చేశారు. పోలవరం అందుబాటులోకి వచ్చేలోపు మూడేళ్ల పాటు తాత్కాలికంగా వినియోగించే ఈ పథకానికి 20 ఏళ్ల డిపిఆర్ ఎందుకు తయారుచేశారనేది రెండో ప్రశ్న. మొదటి నుంచి తప్పుడు జీవోలతో పట్టిసీమను ఎందుకు మొదలెట్టారనేది మూడో ప్రశ్నగా వుంది. డొమెస్టిక్, పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని చెప్పిన ఈ ప్రాజెక్టులో సాగునీటి అవసరాలకు, నిబంధనలకు విరుద్ధంగా నదుల అనుసంధానం అని ఎందుకు అంటున్నారని ఉండవల్లి ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ చర్చ జరిగేనా అనే ఉత్కంఠ మాత్రం నెలకొంది. కృష్ణా నుంచే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులను ఈ చర్చకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది.