ఆంధ్రప్రదేశ్‌

తెనాలి కౌన్సిల్‌లో యుద్ధకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి: ఆంధ్రా ప్యారిస్ తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల కుమ్ములాటకు వేదికగా మారింది. సోమవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో మున్సిపల్ చైర్మన్ కొత్తమాసు తులసీదాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత ప్రత్యేక ప్యానల్ కమిటీ ఎంపిక సజావుగానే జరిగింది. ఈసమయంలో టిడిపికి చెందిన 3వ వార్డు కౌన్సిలర్ గుమ్మడి రమేష్ మాట్లాడుతూ ప్యానల్ సమావేశం అంశాలను మినిట్స్ బుక్‌లో పొందుపరచాలని కోరారు. దీనిపై టిడిపికే చెందిన మరో కౌన్సిలర్ పసుపులేని త్రిమూర్తులు స్పందిస్తూ అత్యవసరంగా ఇలాంటి విషయాలు పొందుర్చటం సాధ్యంకాదంటూ తరువాత చూద్దాంలే అని వ్యాఖ్యానించడంతో రమేష్ దాన్ని వ్యతిరేకించారు. దీంతో దాదాపు అర్ధగంట పాటు ఇద్దరు కౌన్సిలర్ల మధ్య వాదోపవాదనలు, వ్యక్తిగత దూషణలు జరిగి తుదకు ఘర్షణకు దారితీసింది.
ఇద్దరూ కలియబడి కొట్టుకున్నారు. ఈ ఆకస్మిక సంఘటనకు విస్తుపోయిన చైర్మన్ తులసీదాసు, కమిషనర్ కె శకుంతల, అధికార, ప్రతిపక్ష సభ్యులు, వివిధ శాఖల అధికారులు ఏమి జరుగుతోందో అర్థంగాక వౌనంగా చూస్తుండిపోయారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు కల్పించుకొని ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయటంతో మిగిలిన వారుకూడా తమ సీట్లలో నుంచి లేచి వారిని విడదీశారు. దీంతో కొంతమేర వాగ్యుద్ధాలు సద్దుమణిగినా ప్యానల్ సభ్యులు అక్కడ నుండి నిష్క్రమించారు. అనంతరం టిడిపి పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్ అక్కడికి చేరుకుని టిడిపి కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కొట్టుకున్న ఇద్దరు సభ్యులకు సర్దిచెప్పారు. అనంతరం యథావిధిగా సాధారణ సమావేశం జరిగింది. అజెండాలోని 94 అంశాలలో 92 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించవలసిన సభలో అలజడి సృష్టించి ఇతరులను భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరు సభ్యులపై చర్యలు తీసుకోవాలని వైకాపా సభ్యులు చైర్మన్, కమిషనర్‌ను డిమాండ్ చేశారు.

నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలు

విజయవాడ, ఫిబ్రవరి 29: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా రూపొందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సోమవారం సిఎంఓలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే స్నాతకోత్సవాలు మనమంతా గర్వించేలా రూపొందించాలని సూచించారు. భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేసేలా, అత్యుత్తమ కెరీర్‌ను ఎంచుకునేలా విద్యార్థులకు వర్సిటీలు స్ఫూరినివ్వాలని చంద్రబాబు అన్నారు. యూనివర్సిటీలు పవిత్రమైన ప్రాంగణాలని, గతంలో ఎక్కడైనా ఒకచోట చెడ్డపేరు వచ్చి ఉంటే దిద్దుబాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కరణలకు, వినూత్న ఆలోచనలకు కేంద్రాలుగా విలసిల్లాలని కూడా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అవి విద్యార్థుల్లో జ్ఞానతృష్ణను పెంపొంచేవిగా వుండాలన్నారు. నిర్మాణాత్మక పద్ధతుల్లో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేలా చూడాలన్నారు. అన్నివర్గాల విద్యార్థులు ప్రతిభ కనపర్చేలా వైస్ ఛాన్సలర్లు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలను సెనేట్ సభ్యులుగా నియమించామన్నారు.

మే 10న ఎపి ఎంసెట్ ఫలితాలు
హైదరాబాద్‌లో 2 రీజనల్ సెంటర్లు
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఫిబ్రవరి 29: ఎపి ఎంసెట్-2016 ఫలితాలను నిర్దేశించిన సమయం కంటే ముందుగా మే 10వ తేదీన ప్రకటించాలని యోచిస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు వెల్లడించారు. మే 16వ ఎంసెట్ ఫలితాలు వెల్లడించనున్నట్టు ముందుగా ప్రకటించామని, అయితే 10వ తేదీకే ఫలితాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఎంసెట్ ఫైనల్ కీని గతేడాది ప్రవేశ పరీక్ష జరిగిన రెండు రోజుల తరువాత ప్రకటించామని, ఈ ఏడాది పరీక్ష రాసి బయటకు వచ్చిన వెంటనే విద్యార్థులకు కీని అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని జెఎన్‌టియుకెలో డాక్టర్ సాయిబాబు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడారు. ఎంసెట్‌కు విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలవుతున్నట్టు చెప్పారు. సోమవారం వరకు లక్షా 10వేల దరఖాస్తులు అందినట్టు చెప్పారు. రోజుకు 7నుండి 9వేల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం హైదరాబాద్‌లో రెండు రీజనల్ సెంటర్లు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ రీజనల్ సెంటర్లను మార్చుకోదలిస్తే మార్చి 2,3,4 తేదీలలో మార్చుకోవచ్చని ఆయన సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్లో ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకోదలచిన పక్షంలో ఏప్రిల్ 3నుండి 9వ తేదీలోగా చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 21నుండి 27వ తేదీ వరకు హాల్‌టిక్కెట్స్‌ను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎపిఎంసెట్.ఒఆర్‌జి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్ 29న ఎపి ఎంసెట్‌ను నిర్వహిస్తామన్నారు. ఆరోజు ఉదయం 10నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30నుండి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని డాక్టర్ సాయిబాబా వివరించారు.
రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదు: లోకేష్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 29: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం తాను చేయాల్సింది ఎంతో వుందని, ఢిల్లీ వెళ్లి చేసేదేముంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? అని సోమవారం ఇక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. 2017లో 20 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నందున ఇప్పటి నుంచే కసరత్తు చేయాల్సి వుందన్నారు. వలసలపై ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడే నైతికత లేదన్నారు. 2009 తరువాత వైఎస్ హయాంలో తెలుగుదేశం నుంచి వెళ్లినవారిని రాజీనామా చేయించారా? అని ఆయన ప్రశ్నించారు. వైకాపా శాసనసభ్యురాలు రోజా ఏమి మాట్లాడుతున్నదో ఆమెకే అర్థం కావటం లేదని లోకేష్ విమర్శించారు.
నేడో, రేపో భారీగా ఐపిఎస్‌ల బదిలీలు!
రాష్ట్రంలో భారీగా ఐపిఎస్ అధికారులను బదిలీ చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర డిజిపి జెవి రాముడు, హోం శాఖ కార్యదర్శి సతీష్‌చంద్ర సోమవారం ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసి బదిలీలపై చర్చించారు. దీనికి ముఖ్యమంత్రి ఆమోదం తెలపటంతో నేటి అర్ధరాత్రి కాని, లేదా మంగళవారం ఉదయం కానీ బదిలీ ఉత్తర్వులు వెలువడే అవకాశం వుందని భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి నివాసంపై పిల్!
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 29: సిఎం అధికార నివాస గృహానికి సంబంధించి వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్)ను హైకోర్టు స్వీకరించినట్లు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ పరిధిలోని కృష్ణానది కరకట్టపై లింగమనేని ఎస్టేట్స్ గెస్ట్‌హౌస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక నివాసగృహంగా మలచుకున్నారంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించడమే కాకుండా వారంలోపు సంబంధిత వివరాలను, అక్రమ నిర్మాణాలైన పక్షంలో అధికారులు తీసుకున్న చర్యలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అక్రమ నిర్మాణాలైన పక్షంలో అధికారులు తీసుకున్న చర్యలేమిటంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ‘ఆంధ్రభూమి’ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పులు చేయడం సమంజసంగా లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లింగమనేని ఎస్టేట్స్ గెస్ట్‌హౌస్‌లో నివాసం ఉండటం క్విడ్‌ప్రోకోగా ఆయన అభివర్ణించారు. గెస్ట్‌హౌస్‌కు అవసరానికి మించి అద్దెను ఎలా చెల్లిస్తారంటూ ప్రశ్నించారు. చెల్లించాల్సిన దానికన్నా అదనంగా 200 శాతం అదనంగా అద్దె చెల్లిస్తూ అక్కడ నివాసం ఉండటం ఏమిటంటూ ఎమ్మెల్యే ఆర్‌కె మండిపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 29: మధ్య మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వరకూ ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికి తోడు కర్నాటక ప్రాంతంలోని భూ ఉపరితలంపై అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. వీటి ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, తెలంగాణలో పలు చోట్ల స్వల్పంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏటిఎంలో చోరీకి విఫలయత్నం
తిరుచానూరు, ఫిబ్రవరి 29 : తిరుచానూరు రోడ్డులోని సింధూ కూడలిలో ఉన్న ఆంధ్రాబ్యాంకు ఎటిఎం ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. ఎటిఎంలోని సిసి కెమెరాలను ధ్వంసం చేసి లోపలికి వెళ్లిన దుండగులు ఎటిఎంనూ ధ్వంసం చేశారు. అయితే ఎటిఎం మిషన్‌లో ప్రధాన భాగం తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. సోమవారం ఉదయం నగదు కోసం వెళ్లిన వినియోగదారుడు ఎటిఎం ధ్వంసమైన విషయాన్ని గుర్తించి పోలీసులకు, బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి డిఎస్పీ మురళీకృష్ణ, సిఐ సురేంద్రనాయుడు, క్లూస్ టీం పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాల్‌మనీ కేసులో చెన్నుపాటి లొంగుబాటు
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 29: రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో మూడో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే చెన్నుపాటి రత్నకుమారి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మేనమామ చెన్నుపాటి శ్రీనివాసరావు సోమవారం విజయవాడ కోర్టులో లొంగిపోయాడు. రెండు మాసాలకు పైగా పరారీలో ఉంటూ అజ్ఞాతంలో గడిపిన చెన్నుపాటి శ్రీను పోలీసులకు చిక్కకుండా ఇంతకాలం దోబూచులాడుతూ వచ్చాడు. అయితే లొంగుబాటు వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా నగరంలోనే ఉంటున్న శ్రీను నిత్యం పోలీసులకు అందుబాటులో ఉంటూ వారి సలహా మేరకే కోర్టులో లొంగిపోయాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిందితుని లొంగుబాటుతో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. లొంగిపోయేందుకు వచ్చిన శ్రీను కొన్ని గంటలపాటు కోర్టులో గడిపినా.. తమకు కనీసం ముందస్తు సమాచారం లేదని పోలీసులు వాపోవటం గమనార్హం. కోర్టు ఆవరణలో కనీసం ఒక్కరంటే ఒక్కరైనా పోలీసులు మోహరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాల్‌మనీ ఇచ్చి తిరిగి చెల్లించనందున లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఓ మహిళ ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు గత ఏడాది డిసెంబర్ 11న కేసులు నమోదు చేశారు. పటమటకు చెందిన కాల్‌మనీ వ్యాపారి యలమంచిలి రామ్మూర్తి అలియాస్ రాము, భవానీశంకర్, చెన్నుపాటి శ్రీను, ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీరు ఎం సత్యానందం, పెండ్యాల శ్రీకాంత్, వెనిగళ్ల శ్రీకాంత్, దూడల రాజేష్‌లపై అత్యాచారం, చీటింగ్, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.

ఘాట్ రోడ్డు ప్రమాద
బాధితుల్ని ఆదుకుంటాం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 29 : తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవల జరిగిన ప్రమాదంలో రెండుకాళ్లు కోల్పోయిన భక్తుడిని ఆర్థికంగా ఆదుకోవాలని, ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని టిటిడి ఇవో డాక్టర్ డి సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం ఆయన సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఘాట్‌రోడ్డులో భక్తులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు వారికి ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. అయితే రెండుకాళ్లు కోల్పోయిన భక్తుడికి మాత్రం అదనంగా మరికొంత సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.