ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం:ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పుణ్యకాలం పురస్కరించుకుని నవహ్నిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ పూజలను ఆగమ శాస్త్రానుసారంగా ప్రారంభించారు. లోక కల్యాణం కోసం జరిపే ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షిస్తూ అర్చకులు, వేదపండితులు యాగశాల ప్రవేశం చేశారు. యాగశాలలో దేశం శాంతి సౌభాగ్యాలతో ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని అర్చకులు, వేద పండితులు సంకల్పం పఠించారు. అలాగే మహాగణపతి, శివ సంచార దేవతల్లో ఒకరైన చండీశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అంకురార్పన, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించి ధ్వజారోహణం గావించారు.
సమాచారం కోసం మొబైల్ యాప్
శ్రీశైలంలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చరవాణి సమాచార దర్శిని (మొబైల్‌యాప్)ను ఇఓ కెవి సాగర్‌బాబు ఆవిష్కరించారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎస్‌డిఇఎల్‌ఐటిఇటిఆర్‌ఓసిఓఎన్.ఇన్ డౌన్‌లోడ్ చేసుకుని భక్తులు సమచార దర్శినిని చూడవచ్చుని ఇఓ తెలిపారు. బ్రహోత్సవాల ప్రారంభం రోజునే సుమారు 40 వేల మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేశారు.

పుష్పగిరి మఠంలో అవకతవకలు

పోలీస్ స్టేషన్లో మేనేజర్ల పరస్పర ఫిర్యాదులు ..కేసు నమోదు

తిరుపతి, ఫిబ్రవరి 29: ఎంతో ప్రతిష్ట కలిగిన తిరుమల్లోని పుష్పగిరి మఠం గౌరవాన్ని అక్కడ మేనేజర్లుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మంటకలిపేలా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఈక్రమంలో గతంలో మఠం పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న పుండరీకాక్షపై ఇటీవల మృతి చెందిన మఠాధిపతి భారతీస్వామి సోదరుడు విద్యానాథ్ తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు ఆ మఠంలోనే పనిచేస్తున్న రాజగోపాల్, లక్ష్మి నరసింహ, మహేష్‌పైన కూడా ఆయన అదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరు నలుగురు కలిసి రూ.13కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు విద్యానాథ్ నెల రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఆచీతూచీ వ్యవహరిస్తూ పోలీసులు కేసునమోదు చేశారు. ఈక్రమంలో మఠం పర్యవేక్షకుడుగా కొండల్రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ మఠం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనేపధ్యంలో ఆధిపత్య పోరు రోజురోజుకూ ఉద్ధృతమైంది. ఇందులో భాగంగా కొండల్రావు ప్రస్తుత పీఠాధిపతి విద్యాశంకర భారతి మరికొంత మంది కుమ్మక్కై మఠానికి చెందిన కోట్ల రూపాయల నిధులను స్వాహా చేస్తున్నారని రాజగోపాల్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈవిషయంపై కూడా పోలీసులు ఆచీతూచి అడుగులేస్తున్నారు. ఈసంఘటనపై కొండల్రావు తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ మఠంలో అక్రమాలకు పాల్పడ్డాడని రాజగోపాల్‌ను పర్యవేక్షకుడి స్థానం నుంచి తప్పించి తనకు ఆ బాధ్యతలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారని అన్నారు. ఇందులో భాగంగా తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజగోపాల్ గతంలో మఠం పరిపాలనాధికారిగా ఉన్న పుండరీకాక్షయ్య ఏమేరకు డబ్బులు అక్రమంగా పంపించారో తన వద్ద ఆధారాలున్నాయని అన్నారు.

ఇసుక సరిహద్దులు దాటిస్తే పీడీ యాక్ట్
సిఎం చంద్రబాబు హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 29: ముఖ్యమంత్రి చంద్రబాబును సోమవారం ది కానె్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రతినిధులు, భవన నిర్మాణ సంఘ ప్రతినిధులు సిఎంఓలో కలుసుకున్నారు. ఈసందర్భంగా ఇసుక విధానంపై వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని చెప్పి ఎవరైనా రాష్ట్ర సరిహద్దులు దాటిస్తే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం జరగబోతోందని, ఇప్పటికే తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించకపోయినా త్వరలో రాయ్‌పూర్ నుంచి విశాఖను కలుపుతూ ఒక రైల్వే జోన్ వస్తుందని ముఖ్యమంత్రి క్రెడాయ్, బిల్డర్ల ప్రతినిధులతో అన్నారు. నిర్మాణ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. గృహ నిర్మాణ రంగానికి నిర్మాణ సామగ్రి అందించటానికి చైనా ముందుకొస్తోందని తెలిపారు. భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని బిల్డర్లు ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.