ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా అడగలేదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ అడగలేదని బిజె పి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జి సిద్దార్థ్‌నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టా రు. బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిద్దార్థ్‌నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖల్లో విభజన చట్టాన్ని అమలు చేయమనే కోరారని, ప్రత్యేక హోదా కావాలని ఆయన ఎక్కడా పేర్కొనలేదంటూ లేఖల ప్రతులను మీడియాకు చూపించారు. రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా కావాలని మీరు కూడా కోరారు కదా? అని విలేఖరులు ప్రశ్నించగా, 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలో హోదా అక్కర్లేదని ఉందని సింగ్ చెప్పారు. విభజన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తుచ తప్పకుండా అమలు చేస్తోందన్నారు. నీతి ఆయోగ్, 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని సూచించలేదని తెలియచేశారు. ఎపి అంటే మోదికీ ఎంతో ఇష్టమని, చంద్రబాబు అన్నా గౌరవమని, అందువలనే రాష్ట్రానికి 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించారని ఆయన తెలియచేశారు. రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధికి 65 వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. అలాగే పోలవరాన్ని 70:30 నిష్పత్తిలో చేపట్టాల్సి ఉన్నా, ఆ ప్రాజెక్ట్‌ను వంద శాతం పూర్తి చేయడానికి కేంద్రమే బాధ్యత తీసుకుందని ఆయన తెలియచేశారు. ఇప్పటివరకూ కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని సింగ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ఇంత చేసినా, ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేయడం సరికాదని సిద్దార్థనాథ్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపిని రాష్ట్రంలో ఎదగనీయకుండా చేయడానికి కొన్ని పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. టిడిపి తన రాజకీయ ఎదుగుదల కోసం బిజెపిని బలి చేస్తోందని సింగ్ పరోక్షంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, వాటిని ఖర్చు చేస్తున్న తీరును పరిశీలించేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయానికి ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తున్నట్టు చెప్పారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జూన్, జులై నెలల్లో రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయన చెప్పారు. జూన్‌లో అమిత్ షా నేతృత్వంలో విజయవాడలో భారీ సభ ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలియచేశారు. అలాగే కడపలో కూడా ఒక సభ జరుగుతుందని ఆయన వివరించారు.