ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వంపై నా పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 11: చలో అమరావతి పేరుతో తాము చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వని పక్షంలో కాపులందరూ చలో కిర్లంపూడి నినాదంతో కిర్లంపూడి తరలివస్తారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతినిచ్చేవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయన్నారు. కిర్లంపూడిలో శనివారం ఉదయం యథావిధిగా పాదయాత్ర చేసేందుకు వెళ్తున్న ముద్రగడ సహా కాపు జెఎసి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసనగా కాపు ప్రతినిధులు నినాదాలు చేశారు. ముద్రగడను నిర్బంధించినంత కాలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు కిర్లంపూడి తరలివస్తూనే ఉంటారన్నారు. పోలీసులు ఎంతకాలం నిర్బంధించినా పాదయాత్ర జరిగితీరుతుందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే, వైసిపి నాయకుడు కరణం ధర్మశ్రీ కిర్లంపూడి వచ్చి ముద్రగడకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ చంద్రబాబే కాపులను ఓట్లు అడిగారని, అధికారంలోకి రాగానే బిసిల్లో కలుపుతామని హామీనిచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బేషరతుగా కాపులను బిసిల్లో చేర్చుతామని హామీనిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక విస్మరించారని వ్యాఖ్యానించారు. దీంతో ముద్రగడ తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారన్నారు. చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కాపు ఉద్యమాన్ని ముద్రగడ భుజాలపై వేసుకోవల్సి వచ్చిందన్నారు. ఒకప్పుడు కాపు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరికేది కాదని, ఇపుడు వారికే అధిక ప్రాధాన్యతనివ్వడానికి వెనుక ముద్రగడ ఉద్యమమే కారణమని పేర్కొన్నారు. ముద్రగడ పట్టువదలని విక్రమార్కుడని, అతి త్వరలో కాపులకు రిజర్వేషన్లు సాధించుకోవడం తథ్యమని వ్యాఖ్యానించారు. కాగా చలో కిర్లంపూడి పిలుపునందుకుని పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల నుండి కాపు ప్రతినిధులు పెద్ద ఎత్తున ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. కాపు జెఎసి ఆధ్వర్యంలో ముద్రగడ ఇంటి ప్రధాన ద్వారం వద్ద మధ్యాహ్నం ఖాళీ కంచాలతో నిరసన తెలియజేశారు.

చిత్రం.. ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న దృశ్యం