ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’తో నీటి కొరతకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఆగస్టు 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరత ఉండదని జలనవనరుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ హుకుంసింగ్ అన్నారు. 2019 తర్వాత భారతదేశంలో మిగులు జలాలు కలిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఘనత సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో జలవనరుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుచూపు దేశానికే ఆదర్శమని కితాబిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను స్టాండింగ్ కమిటీ శుక్రవారం పరిశీలించింది. ఈసందర్భంగా కమిటీ ఛైర్మన్ హుకుంసింగ్ విలేఖర్లతో మాట్లాడారు. జాతీయ ప్రయోజనాలు దృష్టిలోపెట్టుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిచేస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు చాలా భిన్నమైనదన్నారు. దేశమంతా ఈ ప్రాజెక్టును పరిశీలించడానికి వస్తారనే నమ్మకం తనకుందన్నారు. కమిటీ సభ్యుడు, రాజమహేంద్రవరం ఎంపి మురళీమోహన్ మాట్లాడుతూ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులకు సంబంధించి పూర్తిగా వివరించారన్నారు. పనులు జరుగుతున్న తీరుపట్ల కమిటీ సంతృప్తి వ్యక్తంచేసిందన్నారు. 2019 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని కమిటీకి నమ్మకం కలిగిందన్నారు. జలనవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటివరకు 37సార్లు వర్చువల్ ఇన్‌స్పెక్టన్, 18సార్లు నేరుగా పరిశీలించి, పనులు శరవేగంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, కాంక్రీట్ పనులు, గేట్ల తయారీపై కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తంచేశారన్నారు. ఈ బృందం ఆంధ్రప్రదేశ్‌తోపాటు పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రాబోయే రోజుల్లో దేశంలో నీటి కొరత లేకుండా, నీటి భద్రత కల్పించే విషయంపై దృష్టిపెడుతుందన్నారు.
విజయవాడ నుండి రోడ్డుమార్గాన ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న కమిటీ సభ్యులు ముందుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నమూనాను పరిశీలించారు. ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు, ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబు ప్రాజెక్టు వివరాలను కమిటీ సభ్యులకు వివరించారు. అనంతరం స్పిల్‌వే, కాంక్రీటు పనులను, గేట్ల తయారీ యూనిట్‌ను వారు పరిశీలించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్‌ను వారు పరిశీలించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హుకుంసింగ్‌తో పాటు సభ్యులు బి సత్యభామ, అపురూప్ కొద్దార్, సర్దార్ బల్విందర్ ఎస్ గుహందర్, హర్షవర్ధన్ సింగ్ దుంగార్‌పూర్, రాపోలు ఆనందభాస్కర్, ప్రదీప్ తమాట్, డాక్టర్ సిద్ధాంత మహోపాత్ర, మాగంటి మురళీమోహన్ పనులను పరిశీలించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఏలూరు ఎంపి మాగంటి బాబు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సెక్రటరీ ఆర్‌కె గుప్త, రాష్ట్ర జల నవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, పోలవరం డిఎస్పీ రవికుమార్ తదితరులున్నారు.

చిత్రం..పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ హుకుంసింగ్, సభ్యులు