ఆంధ్రప్రదేశ్‌

బాబు మోసాల్ని ఓడించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల టౌన్, ఆగస్టు 20: గతంలో ఇచ్చిన హామీలు మరచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు నంద్యాల ఉప ఎన్నికలు రాగానే మళ్లీ హామీలు గుప్పిస్తూ మోసం చేస్తున్నారని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఓటర్లు బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన నంద్యాల పట్టణంలోని సలీంనగర్, ప్రియాంకనగర్, డేనియల్‌పురం, సంజీవనగర్‌లో ప్రచారం చేశారు.
ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలు తీర్చకమే మళ్లీ కొత్తకొత్త హామీలు ఇచ్చేందుకు బాబు వచ్చాడన్నారు. మోసపూరిత వాగ్ధానాలు గుప్పించే రాజకీయ నాయకులను ప్రశ్నించినప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందన్నారు. చెప్పినవన్నీ వినుకుంటూ పోతే రేపటి రోజున ప్రతి ఇంటికి మారుతికారు, కిలో బంగారం ఇస్తామంటారని అన్నారు. మోసం చేసే ఇలాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పారో చూశామని, ఎన్నికల తరువాత కర్నూలులో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. ఎయిర్‌పోర్టు, ట్రిపుల్ ఐటి, స్మార్ట్ సిటీ, ఉర్దూ యూనివర్శిటీ, మైనింగ్ స్కూల్ తెస్తామన్నారు. అవుకు వద్ద సిమెంట్ హబ్, కర్నూలులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేస్తానన్నారు. మద్యం, బెల్ట్ షాపులు నిషేదిస్తానన్నారు. ఇవన్నీ నెరవేర్చాడా, మరి చేశాడా అని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నా. డబ్బు అహంకారంతో...అవినీతి సొమ్ముతో ఓటర్లను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడికి భూములు ఇస్తానన్నాడు ఒక్క ఎకరా అయినా ఇచ్చాడా అని అడుగుతున్నా. చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఇవాల మనం ఓటువేద్దామన్నారు. చంద్రబాబు అవినీతి పాలన పోవాలంటే.. వైయస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న శిల్పా మోహన్‌రెడ్డికి ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలన్నారు. ఆయన వెంట పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, వైకాపా నేతలు ఉన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఆదివారం నంద్యాలలో ఓ పక్క వర్షం కురుస్తున్నా ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని సలీంనగర్‌లో ఉదయం 11 గంటల ప్రాంతం లో జోరువానలో పాదయాత్ర చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. అక్కడి నుంచి నందమూరినగర్‌కు చేరుకుని అక్కడ వాహనంపై నుంచి సహాయకులు గొడుగు పట్టుకోగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జనం సైతం వర్షాన్ని లెక్కచేయక జగన్ ప్రసంగాన్ని వినడం గమనార్హం.

చిత్రాలు..నంద్యాల పట్టణంలోని సలీంనగర్, నందమూరినగర్‌లో జోరువానలోనూ ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్