ఆంధ్రప్రదేశ్‌

భూ సమస్యల పరిష్కారమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: భూములకు సంబంధించిన సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు భూసేకరణ, పునరావాస సంస్థ ప్రిసైడింగ్ అధికారి, జిల్లా రిటైర్డ్ జడ్జి జస్టిస్ జగన్నాథం తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధుల్లోని భూ సమస్యలపై విజయవాడలో ఏర్పాటైన భూసేకరణ, పునరావాస సంస్థ కార్యాలయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతంతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా జస్టిస్ జగన్నాథం మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం అవార్డ్‌లు పాసైన తర్వాత ఇక సివిల్ కోర్టులకు ఎలాంటి అధికారాలు ఉండబోవన్నారు. టైటిల్ డీడ్, పరిహారం చెల్లింపులో ఏమైనా సమస్యలు ఎదురైతే ఇక ఈ సంస్థ ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. బాధితులు ఎవరైనా తమ సమస్యలను ఈ అథారిటీ దృష్టికి తీసుకొస్తే పరిష్కారాలు చూపుతామని వివరించారు. కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా భూసేకరణ చేసే సమయంలో భూమి, భవన యజమానులకు ఎలాంటి నష్టం జరగకుండా బాధితులు తమ సమస్యలను ఈ అథారిటీ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. అమరావతితో సమానంగా అన్ని జిల్లాల్లోనూ వివిధ రంగాల్లో వౌలిక సదుపాయాలు కల్పించడానికి భూసేకరణ అవసరమన్నారు. ప్రధానంగా కొత్త రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణ, బైపాస్ రోడ్ల నిర్మాణం వంటి పనులకు భూమి అవసరమన్నారు. ఈ పరిస్థితుల్లో భూసేకరణకు సంబంధించి బాధితులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ సంస్థ చక్కటి పరిష్కార వేదికగా నిలుస్తుందని ఆయన చెప్పారు. కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో హరీష్, అర్బన్ తహశీల్దార్ ఆర్ శివరావు, డిప్యూటీ కలెక్టర్ శారద, ఆర్ అండ్ బి ఇఇ ఎఎల్ మాధవస్వరూప్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సంస్థ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న జస్టిస్ జగన్నాథం, కలెక్టర్ లక్ష్మీకాంతం