ఆంధ్రప్రదేశ్‌

రేణిగుంట రైల్వేస్టేషన్‌లో గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 22: శ్రీవారి భక్తుల రూపంలో రేణిగుంట రైల్వేస్టేషన్ నుంచి గుజరాత్‌లోని వడోదరకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను మంగళవారం సిఆర్‌పిఎఫ్, ఐపిఎఫ్ సిబ్బంది సంయుక్తంగా అరెస్టు చేశారు. సిఆర్‌పిఎఫ్ సిఐ అశోక్‌కుమార్, ఐపిఎఫ్ మధుసూదన్‌ల కథనం మేరకు ఒడిశా రాష్ట్రం బరంపూర్‌కు చెందిన శంకర్ ఆచారి (30), సంతోష్ (28) అనే యువకులు విశాఖ ఏజన్సీ నుంచి 52 కేజీల గంజాయిని కొనుగోలు చేసి విశాఖపట్నం నుంచి వడోదరకు వెళ్లడానికి పోలీసుల తనిఖీలను తప్పించుకునేందుకు రోడ్డు మార్గంలో రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడ నుంచి చెన్నై-అహ్మదాబాద్ రైలులో వడోదర వెళ్లేందుకు నాలుగు ట్రావెలింగ్ బ్యాగుల్లో గంజాయిని నింపుకుని 1వ నెంబర్ ప్లాట్‌ఫాంపై వేచి ఉన్నారని తెలిపారు. వీరిపై అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాము కేవలం ట్రాన్స్‌పోర్టర్లమేనని బరంపూర్‌లో అసలు స్మగ్లర్లు ఇద్దరు ఉన్నారని వారు చెబితేనే తాము సరుకును తరలిస్తామని చెప్పారు. తమతోపాటు మరో ఇద్దరు యువకులు కూడా ట్రాన్స్‌పోర్టర్లుగా ఉన్నారన్నారు. సరుకును గమ్యస్థానం చేరిస్తే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తారని అందుకోసం తాము ఇప్పటికే ఐదుసార్లు ఇలా గంజాయిని రవాణా చేశామని అంగీకరించారు. కాగా ప్రధాన స్మగ్లర్లను పట్టుకుంటామని ఈ సందర్బంగా పోలీసులు తెలిపారు.