ఆంధ్రప్రదేశ్‌

వనం-మనం కింద 25 కోట్ల మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది వనం-మనం కార్యక్రమం కింద 25 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని ఈ వర్షాకాలం పూర్తయ్యేలోగా అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అటవీ పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖలపై మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా వనం-మనం కార్యక్రమం కింద ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటించాలనే లక్ష్యానికి గాను ఇప్పటివరకూ సుమారు 6కోట్ల మొక్కలు నాటించామన్నారు. మిగతా 19కోట్ల మొక్కలను వర్షాకాలం పూర్తయ్యేలోగా నాటించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 శాతం భూభాగంలో అడవులు విస్తరించి ఉన్నాయని దీన్ని 33 శాతానికి మించి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
ఆ లక్ష్యాన్ని అధికమించేందుకు వీలుగా అన్ని ఖాళీ ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని చెప్పారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేసి అవి సక్రమంగా పెరిగే విధంగా చూడాలని ఆదేశించారు. అటవీశాఖ మిగతా అన్ని శాఖలతోను సమన్వయం చేసుకుని నాటిన ప్రతి మొక్క పెరిగే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు ఇందుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు. నగర వనాలపై సిఎస్ సమీక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడల్లో నగర వనాలను మంజూరు చేయగా ఇప్పటికే రాజమండ్రి, కర్నూలులో ఇవి ప్రారంభమై మెరుగైన రీతిలో నిర్వహిస్తున్నారన్నారు. మిగతా మూడు నగర వనాలు త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాయని పేర్కొన్నారు. ఇవిగాక విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా నగర వనాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాల గుర్తింపు ప్రక్రియను చేపట్టారని అవి త్వరగా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
పర్యావరణ పరిరక్షణ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలని ఇందుకుగాను నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిఎస్ దినేష్‌కుమార్ స్పష్టం చేశారు.
అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము మాట్లాడుతూ తమ శాఖలో 50 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని దానివల్ల పర్యవేక్షణకు ఇబ్బంది ఎదురవుతోందని వెంటనే ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. 2014-2017 మధ్య స్మగ్లర్ల నుండి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం వేలం ద్వారా ఇప్పటివరకూ ప్రభుత్వానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చామన్నారు.