ఆంధ్రప్రదేశ్‌

వైకాపా ఏజెంట్ల విధులకు భంగం కలిగించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: నంద్యాల ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి చెందిన పోలింగ్ ఏజెంట్లను వారి విధులు నిర్వహించకుండా అడ్డుకోరాదని హైకోర్టు ఏపి పోలీసులను ఆదేశించింది. వైకాపాకు చెందిన ఏజెంట్లను పాలక పార్టీ టిడిపి నేతలు బెదిరిస్తున్నారంటూ వైకాపా ఎంపి ఎం విజయసాయి రెడ్డి మరో 44మంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించినప్పుడే ఏజెంట్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ కొంత మంది పిటిషనర్లపైన క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను మూసివేస్తూ విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులను ఆదేశించారు.