ఆంధ్రప్రదేశ్‌

ఇవిగో సాక్ష్యాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను అధికార తెలుగు దేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడమే కాకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌కూ ‘ఇవిగో సాక్ష్యాలు’ అంటూ ఫిర్యాదు చేస్తున్నారు. వైకాపాకు చెందిన టివీ ఛానల్‌లో తమ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగించారని టిడిపి ఎంపీలు కేశినేని శ్రీనివాస్ (నాని), కొనకళ్ల నారాయణ మంగళవారం ఫిర్యాదు చేశారు. టిడిపి నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి డబ్బు, మద్యం ప్రవహింపజేస్తున్నారని వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. ముక్కు పుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.