ఆంధ్రప్రదేశ్‌

ఓటేసిపోదురు రండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 22: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో ఉన్న ప్రధాన రాజకీయపార్టీలు ప్రతి ఓటును కీలకంగా చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను బుధవారం నంద్యాలకు రప్పించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నంద్యాలవాసుల్లో ఎక్కువ మంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి తోడు నంద్యాల ప్రాంతానికే పరిమితమైన పాలిష్ కట్టింగ్ స్కిల్డ్ వర్కర్లు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. వీరిని రప్పించేందుకు ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తిరిగే ప్రైవేటు బస్సుల్లో కొన్ని సీట్లు రిజర్వు చేసి పెట్టారు. రెండు మూడు వేల మంది నంద్యాల ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు అంచనా, ఉప ఎన్నిక జరుగుతున్నందున బుధవారం ఓటు వేసేందుకు రావాలని బయటి ప్రాంతాల్లో ఉన్న వారికి బంధువుల ద్వారా ఇప్పటికే కబురంపారు. అయితే పోలింగ్ తేదీ నాటికి నంద్యాలకు చేరుకోవాలంటే రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు దొరక్కపోతే ప్రయాణం మానుకుంటారని భావించిన నేతలు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. నంద్యాలలోని వారి బంధుమిత్రుల ద్వారా ఫోన్ నెంబర్లు సేకరించి ఓటు వేసేందుకు రావాలని అభ్యర్థిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించామని చెబుతూ బస్సులు బయలుదేరే స్థలం, సమయం కూడా సూచిస్తున్నారు.