ఆంధ్రప్రదేశ్‌

ఖరీదైన ఓటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 22: నంద్యాల అసెంబ్లీ స్థానానికి బుధవారం జరుగనున్న ఉప ఎన్నిక ఎన్నడూ లేనంత హైప్ తీసుకువచ్చింది. ఎన్నికలో గెలుపే లక్ష్యంగా వైకాపా, తెలుగుదేశం పావులు కదుపుతూ వచ్చాయి. ప్రచారం ముగియడంతో ఓటర్లకు డబ్బు పంపిణీ కార్యక్రమం సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. గతంతో పోలిస్తే ఈసారి ఓటు విలువ అమాంతం పెరిగిపోయింది. ఓటుకు రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెపుతున్నట్లు సమాచారం. వార్డుల వారీగా ఓటరు జాబితాను అనుసరించి 60 నుంచి 70 శాతం మంది ఓటర్లకు డబ్బు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అయితే డబ్బు పంపిణీ వ్యవహారాన్ని చోటానాయకులు పకడ్బందీగా నిర్వహించారు. అయితే కొన్నిచోట్ల వీరు చేతివాటం ప్రదర్శించడంతో డబ్బు అందని ఓటర్లు నేతలను నిలదీయడం గమనార్హం. దీంతో కంగుతిన్న నేతలు చోటా నేతలను మందరించడమేగాక అప్పటికప్పుడు అలాంటి వారికి డబ్బు సర్దుబాటుచేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని సుమారు 20 శాతం మంది ఓటర్లకు డబ్బు ముట్టకపోవడంతో వారు గగ్గోలు పెడుతున్నారు. గతంలో నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో ఓటుకు రూ.500 కంటే ఎక్కువ పంపిణీ చేయలేదు. ఈసారి టిడిపి, వైకాపా పోటీపడి మరీ ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొంతమంది చేతివాటం ప్రదర్శించి రూ.2 వేల స్థానంలో రూ. వెయ్యి, రూ,3 వేల స్థానంలో రూ.2 వేలు అందించినట్లు తెలుస్తోంది.

చిత్రం..నంద్యాల మండలం అయ్యలూరులో మంగళవారం కవాతు నిర్వహిస్తున్న స్పెషల్ పోలీసులు