ఆంధ్రప్రదేశ్‌

బలపడనున్న వాయుగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 17 : బంగళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం రాత్రికి చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారానికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం దక్షిణ దిశగా కదులుతూ చెన్నై తీరాన్ని సమీపిస్తున్నదని తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒకటి, రెండు చోట్ల భారీనుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంగా పెనుగాలులు వీస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశముందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా తీరం వెంబడి గాలులు వీస్తాయని హెచ్చరించారు.
chitram...
వాయుగుండం ప్రభావంతో మంగళవారం
తిరువనంతపురం తీరంలో అలజడి రేపుతున్న అలలు