ఆంధ్రప్రదేశ్‌

బాబోయ్.. అద్దెలు భరించలేం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూళ్లూరు, మే 18: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం లో అద్దెలు భరించలేం.. విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో ఉండే మహిళా ఉద్యోగులకు భద్రత ఎలా ఉంటుందో..? జూన్ 27న తొలివిడతగా తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. 13వ తేదీనే పిల్లలకు పాఠశాలలు పునప్రారంభమవుతాయి.. వసతులు లేక ఈ ఏడాదికి హైదరాబాద్‌లోనే ఉండాలంటే తమ పరిస్థితి ఏమిటని సచివాలయ మహిళా ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి రెండు బస్సులలో తరలివచ్చిన 200 మంది మహిళా ఉద్యోగినులు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాలను సందర్శించారు. అక్కడినుంచి విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాలకు ఎంత దూరం ఉంది.. ఎంత సమయం పడుతుంది.. వౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాలపై సీఆర్డీయే అదనపు కమిషనర్, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఇళ్ల అద్దెల చెల్లింపు.. స్థానికత అంశాలపై ఉద్యోగినులు జెసితో చర్చించారు. జూన్ 15 నాటికి అన్ని బ్లాక్‌లూ పూర్తవుతాయని చెప్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని మహిళా ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించే అంశాలపై దృష్టి సారించాలని సీఆర్డీయే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆగస్టు నెలాఖరు నాటికి కానీ జీ ప్లస్ త్రీ నిర్మాణాలు పూర్తికావని ప్రభుత్వమే చెప్తుంటే తాము ఎక్కడ పనిచేయాలనే సందేహాలను వ్యక్తం చేశారు. తాత్కాలిక సచివాలయానికి రోడ్డుసౌకర్యం కూడా లేకపోవటాన్ని ప్రశ్నించారు. దీనిపై జెసి శ్రీధర్ స్పందిస్తూ ప్రభుత్వపరంగా మహిళా ఉద్యోగుల భద్రత, రక్షణకు సంబంధించి అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలో ఇళ్ల యజమానులతో సమావేశం నిర్వహించి అద్దెలు తగ్గించాలని కోరనున్నట్లు తెలిపారు. ఉద్యోగినులకు అవసరమైన ప్లాట్లు రెయిన్ ట్రీ పార్కులో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఐజెఎం యాజమాన్యంతో చర్చించి 8 నుంచి 10వేల లోపు అద్దెలు ఉండే విధంగా సంప్రదింపులు జరుపుతున్నామని సీఆర్డీయే అధికారులు తెలిపారు. దీంతోపాటు రెయిన్ ట్రీ పార్కు నుండి ప్రత్యేక ఆర్టీసి బస్సులను ఉద్యోగుల అవసరం మేరకు సచివాలయానికి నడిపే విధంగా ఆర్టీసి అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరిలో ఉండే ఉద్యోగులకు కూడా ప్రత్యేక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ మహిళా ఉద్యోగ సంఘాల నేత సులోచన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి పని చేసేందుకు ఎలాంటి అభ్యంతరంలేదు.. అయితే కనీస వసతులు కూడా ఇక్కడ కనిపించటం లేదన్నారు. దీనిపై ప్రభుత్వంతో మరోసారి సంప్రదింపులు జరిపి వచ్చే నెలలో తరలింపు విషయమై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.