ఆంధ్రప్రదేశ్‌

10న నింగిలోకి పిఎస్‌ఎల్‌వి-సి 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఈనెల 10న పిఎస్‌ఎల్‌వి-సి 32 ప్రయోగం జరగనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి జరిగే ఈ రాకెట్ ద్వారా 1425 కిలోల బరువు గల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నా రు. ఇప్పటికే వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో (వ్యాబ్) రాకెట్ నాలుగు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేసి శుక్రవారం రాత్రి చివరి దశలో ఉపగ్రహాన్ని అమరికతో పాటు దానిచుట్టు ఉష్ణకవచాన్ని అమర్చే ప్రక్రియను పూర్తిచేశారు. ఆదివారం ఉదయం 6 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 32 రాకెట్‌ను వ్యాబ్ నుండి షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ పచ్చజెండా ఊపి ప్రయోగ వేదికకు తరలిస్తారు.
సోమవారం డాక్టర్ సురేష్ అధ్యక్షతన షార్‌లో ప్రయోగానికి సంబంధించిన చివరి మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) జరగనుంది. ఎంఆర్‌ఆర్ అనంతరం అదేరోజు షార్ డైరెక్టర్ ఆధ్వర్యంలో లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఎబి) సమావేశమై ప్రయోగానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. నావిగేషన్ సేవల నిమిత్తం ఇస్రో ఈ ప్రయోగం చేపడుతోంది. ఇప్పటికే ఈ సిరీష్ 7 ప్రయోగాల్లో 5 ప్రయోగాలు విజయవంతంగా చేపట్టారు. నావిగేషన్ సిరీస్‌కు సంబంధించి ఆరో ప్రయోగం కాగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో 34వది కావడం విశేషం. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఈనెల 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాకెట్ రెండో ప్రయోగ వేదిక నుండి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగరనుంది. 12 సంవత్సరాల పాటు ఈ ఉపగ్రహం తన సేవలను అందించనుంది.
మేఘాలయకు చేరిన
సంగ్మా భౌతికకాయం
సోమవారం అంత్యక్రియలు
షిల్లాంగ్, మార్చి 5: లోక్‌సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా భౌతికకాయాన్ని శనివారం మేఘాలయలోని ఆయన స్వంత ఊరు తురాకు తీసుకువచ్చారు. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన సంగ్మా అంత్యక్రియలు సోమవారం తురాలో జరుగుతాయి. సంగ్మా శుక్రవారం ఉదయం ఢిల్లీలో గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. సంగ్మా భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గౌహతికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌లో వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో గల తురాకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, కిరెన్ రిజిజు ఢిల్లీ నుంచి సంగ్మా భౌతికకాయం వెంట వచ్చారు. మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్ గౌహతిలో వారితో కలిసి భౌతికకాయం వెంట తురాకు వచ్చినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి అమిత్ మహాజన్ తెలిపారు. మార్గమధ్యంలో బోర్‌ఝర్ విమానాశ్రయంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ కూడా వారితో కలిసి హెలికాప్టర్‌లో తురాకు చేరుకున్నారు. దివంగత నేతను చూడడానికి తురా విమానాశ్రయానికి, విమానాశ్రయం నుంచి ఆయన నివాసానికి వెళ్లే దారిలో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.