ఆంధ్రప్రదేశ్‌

రూ.4500 కోట్లతో లింక్ రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 12: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 67 ఏళ్లలో కూడా 24 ఏళ్ల కుర్రాడిలా కష్టపడుతున్నారని, అన్ని స్థానాలూ గెలిపించుకొని ఆయన కష్టానికి రుణం తీర్చుకోవాలన్నారు. మంగళవారం ఆయన జిల్లాలో ఎస్.కోట, ఎల్.కోట, విజయనగరం, గజపతినగరం ప్రాంతాల్లో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కంటే టిడిపి హయాంలోనే ప్రజలకు ఎక్కువ మేలు జరిగిందన్నారు. మూడు నెలల్లో అన్ని గ్రామాలకు ఎల్‌ఇడి దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు. తొలి విడతగా విజయనగరం, తూర్పుగోదావరి, కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. వచ్చే రెండు నెలల్లో రూ.4500 కోట్లతో లింక్ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. వృద్ధాప్య, వికలాంగ పింఛన్‌ను రూ.200 నుంచి ఐదు రెట్లు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలు సరఫరా చేయగలుగుతున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్నామన్నారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు రూ.6వేల రుణమాఫీ చేశామని, మిగిలిన రూ.4వేలు వడ్డీతో సహా మాఫీ చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీ పోటీ పడలేక ప్రజల మధ్య కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తోందన్నారు. దొంగ పేపర్, దొంగ ఛానల్ ఉండటం వల్లనే దొంగ అబ్బాయి జైలుకు వెళ్ళాడని జగన్‌ను ఎద్దేవా చేశారు. తొలిరోజు పర్యటనలో భాగంగా ఎస్.కోటలో రూ.30 కోట్లతో 302 గ్రామాలకు తాగునీరు అందించే పథకాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ కింద 330 గ్రామాల్లో లక్ష మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సోలార్ విద్యుత్‌తో పనిచేసే 91 తాగునీటి పథకాలను ప్రారంభించారు. గజపతినగరం నియోజకవర్గంలోని కొణిశలో చంపావతి నదిపై నిర్మించనున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, కెఎ నాయుడు, మీసాల గీత, కిమిడి మృణాళిని, ఎమ్మెల్సీలు జగదీష్, సంధ్యారాణి, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమవతి, జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు పడాల అరుణ, భంజ్‌దేవ్ పాల్గొన్నారు.
చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్