ఆంధ్రప్రదేశ్‌

రాజమహేంద్రికి ప్రాచీన నగర హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 12: సంఘ సంస్కరణల పురిటిగడ్డ రాజమహేంద్రవరానికి ప్రాచీన నగర హోదా సాధించేందుకు కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల రాజమహేంద్రవరం నగరంలో పర్యటించిన సందర్భంలో ఈ మేరకు ప్రకటించడంతో ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2015లో ‘హృదయ్’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దేశంలోని ప్రాచీన నగరాలు, కట్టడాలు, వింతలు, విడ్డూరాలు తదితర వందేళ్ల నుంచి నూట యాభై ఏళ్లు దాటిన ప్రాంతాల సంరక్షణకు అపరూప కట్టడాలుగా చర్యలు తీసుకుంటారు. ఇందుకు అవసరమైన నిధులు కేటాయించి, సంరక్షణ కల్పించి, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతారు.
ఈ పథకంలో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా అహ్మదాబాద్, జోధ్‌పూర్ వంటి 23 పట్టణాలు, నగరాలు చోటు సాధించాయి. ప్రాచీన హోదా కలిగిన నగరాల్లో రాజమహేంద్రవరం నగరాన్ని కూడా చేర్చాలని, అటువంటి అన్ని అర్హతలు ఈ నగరానికి ఉన్నాయని ఈ పథకం కోసం ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనితోఅప్పట్లోనే జిల్లా కలెక్టర్ కేంద్రానికి నివేదిక పంపించారు. జిల్లా కలెక్టర్ ద్వారా ఈ పథకానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) కూడా తయారు చేయించారు. ఈ నివేదిక ఎందుకనో అప్పట్లో మరుగున పడిపోయింది. ఇపుడు ముఖ్యమంత్రి ప్రకటనలో మళ్ళీ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్టయింది. వాస్తవానికి గత పుష్కరాల సమయంలోనే ముఖ్యమంత్రి ఈ విధంగా వెల్లడించారు. నగరానికి ప్రాచీన నగర హోదా లభిస్తే కోట్లాది రూపాయల నిధులు సమకూరుతాయి. నేరుగా కేంద్రం నుంచి అందే నిధులతోనే ప్రాచీన నగరాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుంది. డిపిఆర్ కేంద్రానికి అందింది కాబట్టి త్వరలో నగరానికి ప్రాచీన హోదా దక్కే అవకాశంవుందని తెలుస్తోంది. చారిత్రక ప్రాశస్థ్యం కలిగిన రెండో శతాబ్దానికి చెందిన రాజమహేంద్రవరం నగరానికి ప్రాచీన నగరం హోదా లభించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
గత కాలపు వారసత్వానికి భంగం కలగకుండా రివర్ సిటీ రాజమహేంద్రవరం నగరానికి ప్రాచీన నగర హోదా కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంబ్రాబునాయుడు నగర ప్రజలకు తాజాగా హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు చేపట్టారు. కేంద్రం చేతిలోని ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీకి చెందిన రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తెలుగుదేశం పార్టీకి చెందిన రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ కసరత్తు చేస్తున్నారు.
రెడ్డి రాజులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు, కాటయ వేమారెడ్లు, రెడ్డి రాజులు, శాతవాహనులు ఇలా ఎంతో మంది రాజులు పరిపాలించిన నగరం రాజమహేంద్రవరం. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దానికి చెందిన ఈ నగరంలో అనేక ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు, మసీదులు, చర్చిలు వున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాకారాలున్నాయి. క్రీస్తుశకం 1323 నాటి పెద్ద మసీదు, 1703 నాటి ఉత్తరాది మఠం తదితరాలు వున్నాయి.
రాళ్ళబండి సుబ్బారావు మ్యూజియంలోని బంగారు నాణాలు ఎన్నో ఏళ్ల చరిత్రకు సాక్షం పలుకుతున్నాయి. క్రీస్తుశకం 900 నాటికి అమ్మరాజు విష్ణువర్ధనుడి శాసనం వుంది. సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఇక్కడి వారే కావడం, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ఇక్కడ పనిచేయడం, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడి ట్రైనింగ్ కాలేజిలో అధ్యాపకుడుగా పనిచేయడం వంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఎన్నో ఏళ్ల చరిత్రకు ఆనవాళ్లు నేటికీ సజీవంగా ఉన్నాయి.
కందుకూరి నివాసం, కందుకూరి స్థాపించిన టౌన్‌హాలు, కాటన్ మహనీయుని నివాసం తదితర ప్రాంతాలను, ప్రాచీన కట్టడాలు ఇప్పటికే పురావస్తు శాఖ సంరక్షణలో వున్నాయి. తర తరాల చారిత్రక ప్రాశస్థ్యాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనవుంది. తిరుపతి, అమరావతి తర్వాత రాజమహేంద్రవరానికే ప్రాచీన హోదా కలిగిన అర్హతలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.