ఆంధ్రప్రదేశ్‌

డెడ్‌లైన్ డిసెంబర్ 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, సెప్టెంబర్ 12: ఇచ్చిన హామీలు అమలుచేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న ఇబ్బందేమిటో తెలియజేయాలని, అమలుచేసే ఉద్దేశ్యం లేనప్పుడు అసలు హామీలు ఎందుకు ఇవ్వాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. డిసెంబర్ 6వ తేదీ అంబేద్కర్ వర్థంతి రోజులోగా కాపులకు బిసి రిజర్వేషన్ అమలుచేయాలని, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశించి పద్మనాభం మళ్లీ లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖ నకళ్లను కిర్లంపూడిలో మంగళవారం పత్రికలకు విడుదలచేశారు. కాపులను బిసి జాబితాలో చేరుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయమని 2015, జూలై 26న మొదటి లేఖలో కోరానని, తర్వాత ఎన్నో లేఖలు రాశానని, అయినప్పటికీ ఎటువంటి సమాధానం రాలేదన్నారు. కార్యాచరణలో భాగంగా తునిలో సభ పెట్టుకుంటే కాపుజాతిని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, ఆ రోజు జరిగిన సంఘటనలకు ఎవరు కారకులో సిబిసిఐడి విచారణలో తేలవచ్చునన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాదిరిగా పల్స్ సర్వే ఒక రోజులో చేయించి, ఆ నివేదికను మంజునాథ్ కమిషన్‌కు పంపితే నెలల వ్యవధిలోనే కాపులకు న్యాయం చేయవచ్చునన్నారు. కాపులంటే ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. ఇచ్చిన హామీని గుర్తుచేయడం కోసం చావోరేవో చలో అమరావతి పాదయాత్ర చేద్దామని నిర్ణయంచేసి, తెలియజేస్తే ఈ ఏడాది జూలై 26నుంచి పశువుల దొడ్డిలో పెట్టినట్టు పోలీసు అధికారులను కాపలా ఉంచి పాదయాత్రను అడ్డుకున్నారని ఆరోపించారు. పాదయాత్ర చేయలేనని పదేపదే సవాళ్లు విసరడం వల్ల తమరు జిల్లాలో ఉండగానే సవాల్‌ను స్వీకరించాలని నిర్ణయించుకుని, ఆగస్టు 27న పాదయాత్ర అమలుచేశానని లేఖలో పేర్కొన్నారు. తన పాదయాత్రను ఎవరూ భగ్నం చేయలేదని, పోలీసు ఉన్నతాధికారులు కోరిన మీదట తానే తగ్గానని గమనించాలన్నారు. కాపుల కోసం పోరాటం చేయడం తనకు లభించడం అరుదైన అవకాశమని పేర్కొన్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఉద్యమాన్ని తాను చేసినప్పుడు మీరు ఎన్ని కోట్లు ఇచ్చి నా ఉద్యమాన్ని బలపర్చారో చెప్పాలని చంద్రబాబుపై ముద్రగడ ధ్వజమెత్తారు.