ఆంధ్రప్రదేశ్‌

రూ. 5.7 కోట్ల నగదుతో డ్రైవర్ పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, సెప్టెంబర్ 14: కర్నూలు జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి చెందిన రూ.5.7 కోట్ల నగదును మంగళవారం అర్ధరాత్రి రాత్రి కర్నూలు జిల్లా డోన్ మండలం ప్యాపిలి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు గురువారం కర్నూలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. జిల్లాలో సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి సేఠ్ కరెంట్ చౌషా బెంగళూరులో బంగారం కొనుగోలు నిమిత్తం రూ. 5.7 కోట్ల నగదును తనకు నమ్మకస్థుడైన దీప్తికరణ్‌కు ఇచ్చి స్కార్పియో వాహనంలో మంగళవారం రాత్రి పంపించారు. అయితే వాహనంలో డబ్బు తీసుకెళ్తున్నట్లు తెలుసుకున్న గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి దాటాక కర్నూలు జిల్లా డోన్ మండలం ప్యాపిలి సమీపంలో స్కార్పియోను అడ్డుకున్నారు. దీప్తికరణ్‌ను కిడ్నాప్ చేసి డబ్బు ఎత్తుకెళ్లారు. దీప్తికరణ్‌ను బుధవారం మహారాష్టల్రోని నాగపూర్ వద్ద వదిలి వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్న దీప్తికిరణ్ జరిగిన సంఘటన గురించి వ్యాపారికి వివరించాడు. ఈ విషయాన్ని వ్యాపారి కరెంట్ చౌషా గురువారం కర్నూలు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు డోన్ సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వాహనం ఎన్ని గంటలకు వచ్చింది, దాని వెంట ఎవరెవరు ఉన్నారు తదితర వివరాలు తెలుసుకునేందుకు డోన్ సమీపంలోని టోల్ గేట్ వద్ద ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించినట్లు తెలిసింది. డబ్బుతో బెంగళూరుకు బయలుదేరిన వాహనం కర్నూలు జిల్లా డోన్ సమీపంలోని ఓబుళాపురం, ప్యాపిలి మధ్య ఆగినట్లు జిపిఎస్ ఆధారాల ద్వారా వెల్లడైనట్లు సమాచారం. దీప్తికరణ్ చెప్పినట్లు రూ. 5.7 కోట్ల నగదును ఎక్కడినుంచి డ్రా చేశారు, ఎక్కడకు తీసుకెళ్తున్నారు, సెక్యూరిటీ లేకుండా అంత పెద్ద మొత్తాన్ని అర్ధరాత్రి సమాయంలో తరలించాల్సిన అవసరం ఎందుకువచ్చింది అన్న వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన గురువారం జిల్లాలో సంచలనం రేపింది.