ఆంధ్రప్రదేశ్‌

మొక్కల కోసం గ్రీన్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, సెప్టెంబర్ 14: మొక్కలను నేరుగా నర్సరీ రైతుల నుంచి వినియోగదారులు కొనుగోలు చేసుకునేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించామని ఆంధ్రప్రదేశ్ అర్బన్ గ్రీనరీస్ అండ్ బ్యూటిఫికేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎపియుజిడిఎ) మేనేజింగ్ డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కడియం జిఎన్నార్ కనె్వన్షన్ హాలులో ‘గ్రీన్ ఎపి యాప్’ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఎపి పేరిట ఈ యాప్‌ను తయారుచేశామని, గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఈయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మొక్కల రకాలు, అవి లభించే నర్సరీల వివరాలు ఉంటాయన్నారు. వినియోగదారులు ఈ యాప్ ద్వారా మొక్కల గురించి తెలుసుకోవచ్చునన్నారు. ఇండోర్ ప్లాంట్, షేడ్ ప్లాంట్, పూలమొక్కలు, సీజనల్, లాన్‌గ్రాస్, ఎవిన్యూ, ఎడినీయం, పామ్స్, క్రీపర్ మొక్కలు గురించి అన్ని వివరాలు ఈయాప్‌లో నిక్షిప్తంచేశామని చంద్రమోహన్‌రెడ్డి వివరించారు. తమ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో గార్డెనింగ్ అభివృద్ధికి తాము అనేక సలహాలు, సూచనలు చేశామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించామన్నారు. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం దేవస్థానాలతోపాటు పలు ప్రభుత్వాసుపత్రులు, కార్పొరేట్ కార్యాలయాలకు గార్డెనింగ్ డిజైన్లను తామే అందించామన్నారు. ్ర దీనిద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయన్నారు. ఏయే నర్సరీల్లో ఏయే రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయో ఫొటోలతో సహా నిక్షిప్తంచేశామన్నారు. యాప్ డిజైనర్ శ్రావణ్‌కుమార్, హార్టికల్చరల్ అసిస్టెంట్ డైరెక్టర్ చిట్టిబాబు, ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, కడియం నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా చంటి, ఐఎన్‌ఎ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రదీప్‌గాను తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..యాప్ ప్రారంభించిన ఎపియుజిడిఎ ఎండి చంద్రమోహన్‌రెడ్డి