ఆంధ్రప్రదేశ్‌

రేపు కాకినాడ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 14: కాకినాడ నగర పాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ఈ నెల 16వ తేదీన కాకినాడ కార్పొరేషన్‌లో జరుగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను అనుసరించి మేయర్, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. ఎన్నికల అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ నెల 1వ తేదీన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లున్నాయి. కోర్టు వివాదాల కారణంగా రెండు డివిజన్ల ఎన్నికలు వాయిదాపడ్డాయి. 48 డివిజన్లకు ఎన్నికలు జరుగగా తెలుగుదేశం 32 స్థానాల్లో, మిత్రపక్షం బిజెపి మరో 3 స్థానాల్లో మొత్తం 35 డివిజన్లు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. విపక్ష వైసిపి అభ్యర్థులు పది డివిజన్లలో గెలుపొందారు.