ఆంధ్రప్రదేశ్‌

సిఎం డ్యాష్ బోర్డులోకి బయోమెట్రిక్ హాజరు: గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: కేజి నుంచి పిజి వరకు బయోమెట్రిక్ హాజరు చేపట్టి, సిఎం డ్యాష్ బోర్డులోకి అనుసంధానించాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు నమోదులో కొన్ని వర్సిటీలు అలసత్వం వహించడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తిస్థాయిలో హాజరు నమోదుకు చర్యలు చేపట్టాలని అన్ని వర్సిటీల విసిలను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్ నుంచి గురువారం ఆయన వైస్ చాన్సలర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల బలోపేతం కోసమే అధ్యాపకుల భర్తీ చేపట్టనున్నామని, ఈ క్రమంలో ప్రతి వర్సిటీ ఇందుకు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. సెప్టెంబర్ చివరికల్లా ప్రతి వర్సిటీ ఫ్యాకల్టీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఏపిపిఎస్సీ ద్వారానే ఫ్యాకల్టీల భర్తీ ఉంటుందని, డిసెంబర్ చివరిలోపు ఏపిపిఎస్సీ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వర్సిటీల విసిలు ఈ విషయంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. నాక్ గ్రేడింగ్‌పై విస్తృత చర్చ జరిగింది. నాక్ గ్రేడింగ్ సాధించేందుకు వర్సిటీలు చేపడుతున్న చర్యలను మంత్రికి ఈ సందర్భంగా విసిలు వివరించారు. పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సు, ఏపి సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ ఏర్పాట్లపైనా మంత్రి పలు సూచనలు చేశారు. రూసా నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని, అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి గంటా స్పష్టం చేశారు. రూసా నిధులపై విస్తృతంగా చర్చించారు. వాటి ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను విసిలు వివరించారు. యుటిలిటీ సర్ట్ఫికెట్లు అందజేస్తే కేంద్రం నుంచి నిధులు పొందేందుకు సాధ్యమవుతుందన్నారు. ప్రతి వర్సిటీలోను వైఫై ఉండాలని, ఎలాంటి వౌలిక సదుపాయాల కొరత ఉండకూడదని స్పష్టం చేశారు. తమ వర్సిటీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, వినూత్న సంస్కరణల గురించి మంత్రికి విసిలు వివరించారు.