ఆంధ్రప్రదేశ్‌

మంత్రి గంటాతో ఎమ్మెల్సీల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: ఏకీకృత నిబంధనల రూపకల్పనపై మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, గాదె శ్రీనివాసులు నాయుడు, రామకృష్ణ, రామసూర్యారావు తదితరులు గురువారం భేటీ అయ్యారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను తెలుసుకుంటూ నిబంధనలను ఏ విధంగా రూపొందించాలనే అంశంపై చర్చించారు. అందరికీ ఆమోదయోగ్యంగానే ఏకీకృత నిబంధనల రూపకల్పన ఉంటుందని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిబంధనలను రూపొందించాలని విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
రేపు డీసెట్ పరీక్ష ఫలితాల విడుదల
డీసెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం సచివాలయంలోని ఫోర్త్‌బ్లాక్‌లో డీసెట్ పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నట్లు డీసెట్ కన్వీనర్ దేవానందరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 51,500 మంది డీసెట్ పరీక్షకు హాజరైనట్లు ఆయన తెలిపారు.