ఆంధ్రప్రదేశ్‌

సైబర్ సెక్యూరిటీ హబ్‌గా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్రాన్ని సైబర్ సెక్యూరిటీకి హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ రంగానికి పెద్దపీట వేయడంతో పాటు సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించామన్నారు.
దేశంలో టెక్నాలజీ వినియోగించే రాష్ట్రాల్లో ఎపి ముందు వరుసలో ఉందన్నారు. గతంలో దెయ్యాలు పింఛన్లు తీసుకునేవని, సాంకేతికత వినియోగించడం ద్వారా వాటికి అడ్డుకట్టవేయగలిగామన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఐటి ఉద్యోగాలు ఎక్కువ తెలంగాణాకే పరిమితం అయ్యాయని గుర్తు చేశా రు. అరశాతం నిపుణులు మాత్రమే రాష్ట్రానికి తరలివచ్చారన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రభుత్వ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు సేవలు అందించాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. పరిపాలన అంతా టెక్నాలజీతోనే జరుగుతున్నప్పుడు హ్యాకింగ్ బెడద లేకుండా చూడాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇందులో భాగంగానే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సైబర్ సెక్యూరిటీ పెంచేందుకు విశాఖ వేదికగా అంతర్జాతీయ వ్యాపార సదస్సు అక్టోబర్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యువతకు కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ బ్లాక్ చైన్ సదస్సు నిర్వహిస్తున్నామని, ఎక్కువ టెక్నాలజీ వాడే కంపెనీలన్నీ ఈ సదస్సుకు హాజరవుతాయన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉందన్నారు. ఈ సదస్సును సిఎం ప్రారంభిస్తారన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రభుత్వ పరంగానే కాకుండా, ప్రైవేట్ రంగంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే రవాణా, రెవెన్యూ శాఖల్లో ప్రయోగాత్మకంగా ఈ టెక్నాలజీ ప్రవేశపెట్టామన్నారు.
బ్లాక్ చైన్ టెక్నాలజీ అందుబాటులోకి రావాలంటే ప్రభుత్వ పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆర్‌బిఐ, సెబి, వివిధ దేశాల ప్రతినిధులు హాజరు కానున్నానరన్నారు. ఈ మేరకు బ్లాక్ చైన్ బిజినెస్ బ్రోచర్‌ను, వెబ్‌సైట్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఏ కంపెనీకి భూమి ఇవ్వాలన్నా, పూర్తిగా కసరత్తు చేస్తున్నామని, బోగస్ కంపెనీలను దరిచేరనివ్వమని స్పష్టం చేశారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న ఐటి శాఖ మంత్రి నారా లోకేష్