ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ మేయర్ ఎన్నిక నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 15: కాకినాడ నగర పాలక సంస్థ మేయరుగా ఎవరు ఎన్నికవుతారనే ఉత్కంఠకు శనివారం తెరపడనుంది. శనివారం కొత్త మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నిక అనంతరం ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ కార్పొరేషన్‌లో కౌన్సిల్ హాలును అధికారులు తీర్చిదిద్దారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు మేయర్, డిప్యూటీ మేయర్‌ల నియామకంపై ఇప్పటికే జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, జిల్లా మంత్రులతో సంప్రదించి, ఖరారు చేసినట్టు సమాచారం. ఈమేరకు మంత్రులు సీల్డ్ కవర్‌తో సహా శనివారం జిల్లా కేంద్రం కాకినాడ చేరుకోనున్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను అనుసరించి తొలుత కౌన్సిల్‌లో కార్పొరేటర్ల సమావేశం ఏర్పాటుచేస్తారు. అనంతరం చేతులు ఎత్తే విధానంలో మేయర్‌ను ఎన్నుకుంటారు. అయితే అంతకు ముందే అధికార తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లతో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితరులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సీల్డ్‌కవర్‌లో అధినేత ప్రకటించిన మేయరు, డిప్యూటీ మేయరు పేర్లను వెల్లడిస్తారు. తర్వాత అధికారికంగా జరిగే ఎన్నికలో ప్రతిపాదిత అభ్యర్థులకు అనుకూలంగా అధికార టిడిపి కార్పొరేటర్లు చేతులెత్తి ఎన్నుకుంటారు.
కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లున్నాయి. కోర్టు వివాదాల కారణంగా 2 డివిజన్ల ఎన్నికలు వాయిదా పడగా, 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. తెలుగుదేశం 32 స్థానాల్లోను, మిత్రపక్షం బిజెపి 3 స్థానాల్లో విజయం సాధించింది. 10 స్థానాల్లో ప్రతిపక్ష వైసిపి అభ్యర్ధులు విజయం సాధించారు. మూడుచోట్ల స్వతంత్య్ర అభ్యర్ధులు గెలుపొందారు. అధికార తెలుగుదేశం పార్టీకి నాలుగు ఎక్స్ అఫీషియో ఓట్లు కూడా ఉన్నప్పటికీ, ఆ అవసరం లేకుండానే ఎన్నుకునేంత మెజార్టీ టిడిపికి లభించింది.