ఆంధ్రప్రదేశ్‌

జగన్ ఆస్తులు ప్రభుత్వపరం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ 2004లో జగన్ ఆస్తుల విలువ 9.18 లక్షలుండగా 2009లో 77.40 కోట్లకు (90 రెట్లు) చేరిందని, అవే ఆస్తులు 2011కల్లా 365 కోట్లకు (400 రెట్లు) ఎలా ఎగబాకిందని ప్రశ్నించారు. ఈ ఆస్తుల కంటే వందల రెట్లు ఆస్తులు అతను సంపాదించగా, ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు మాత్రమే తాను చెబుతున్నానన్నారు. ఇప్పటికైనా జగన్ చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన అవినీతి సంపాదన ప్రభుత్వానికి దఖలు చేయాలని కోరారు. ఇదిలావుంటే, జగన్మోహన్‌రెడ్డికి ధైర్యం ఉంటే తన ఆస్తులపై ప్రకటన చేయాలంటూ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. దేశంలోనే తొలిసారిగా వ్యక్తిగత ఆస్తులనే కాక కుటుంబ ఆస్తులను కూడా ప్రకటించే ప్రజాస్వామిక సాంప్రదాయానికి నాంది పలికిన తొలి రాజకీయ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే అని శుక్రవారం ఒక ప్రకటనలో డొక్కా పేర్కొన్నారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకుండానే లక్ష కోట్లు దోపిడీ చేశారని నిర్ధారణ అయిందన్నారు.