ఆంధ్రప్రదేశ్‌

ప్రజా ఉద్యమాలతోనే సురాజ్య సాధన: జెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 15: ప్రజలకు మంచి పాలన అందించే బాధ్య త ప్రభుత్వాలపై ఉందని, మంచి పాలన సాధించేందుకు ప్రజలు సంఘటితంగా ఉద్యమించాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. ప్రజల కోసం, వారిని భాగస్వామ్యం చేస్తూ చేపట్టిన ‘సురాజ్య యాత్ర’ను విశాఖలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం జరుగుతున్న ఈ యాత్రలో యువత స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సమష్ఠిగా కలిసి పోరాడాల్సిన అవశ్యకత ఉందన్నారు. కుల, మత, వర్గ రాజకీయాలను రూపుమాపితేనే సురాజ్యం సిద్ధిస్తుందన్నారు. లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపం లో వసూలు చేస్తున్న ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఆరోగ్య భద్రత లేదని, మంచి విద్య, ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయన్నారు. కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో రూ.40వేలకు నాణ్యతతో కూడిన విద్య అందుతోందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై రూ.50 వేలు వెచ్చిస్తున్నా ఫలితాలు ఎందుకు నిరాశపరుస్తున్నాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎపి, తెలంగాణా రాష్ట్రాల లోక్‌సత్తా కోఆర్డినేటర్ బండారు రామ్మోహన రావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తదితరుల పాల్గొన్నారు.