ఆంధ్రప్రదేశ్‌

‘ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచుతాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 15: ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచేందుకే గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో తాను కాలికి శస్తచ్రికిత్స చేయించుకున్నానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చిన్నపిల్లలకు సూదిమందు వికటించిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి రుయా ను సందర్శించారు. అనంతరం తన మొక్కును తీర్చుకోవడంలో భాగం గా అలిపిరి కాలినడక దారి గుండా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తన మోకాలికి గాయమైతే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శస్తచ్రికిత్స చేయించుకున్నానని చెప్పారు.
తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్తచ్రికిత్సలను ప్రోత్సహించాలన్నదే తన ఆలోచన అన్నారు. తనకు శస్తచ్రికిత్స చేయడానికి దేశ, విదేశాల నుంచి ఎంతోమంది డాక్టర్లు ముందు కు వచ్చినా తాను చేయించుకోలేదన్నారు. చిన్నపిల్లల ఆస్పత్రిలో సూది మందు వికటించిన సంఘటనను ప్రస్తావించినప్పుడు తాను అధికారులతో చర్చించానని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించానన్నారు. కాగా శుక్రవారం తిరుమలకు వెళ్లిన మంత్రి శనివారం శ్రీవారిని దర్శించుకుని తిరిగి రుయాను సందర్శించనున్నారు. ఈకార్యక్రమంలో తుడా చైర్మన్ నరసింహయాదవ్, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..రుయాలో అస్వస్థతకు గురై కోలుకున్న చిన్నారులను పరామర్శిస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్