ఆంధ్రప్రదేశ్‌

టెన్త్ విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాష్టీకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడదవోలు, సెప్టెంబర్ 15: స్టడీ అవర్స్‌లో తోటి విద్యార్థితో మాట్లాడుతున్నాడనే ఆగ్రహంతో ఒక ఉపాధ్యాయుడు క్లిప్ ఉన్న ప్యాడ్ విసిరేయడంతో టెన్త్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్యాడ్‌కు ఉన్న లోహపు క్లిప్ బుగ్గలోకి దూసుకుపోవడంతో ఆరు నెలల పాటు ఆ విద్యార్థి ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాల్సివుంది. నిడదవోలులో ఒక ప్రైవేటు పాఠశాలో గురువారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఫజలుల్లా కుమారుడు హుజయఫా పట్టణంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో గురువారం రాత్రి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో హుజయఫా తోటి విద్యార్థితో మాట్లాడుతుండటంతో కోపోద్రిక్తుడైన మ్యాథ్స్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ వారిపైకి లోహపు క్లిప్ ఉన్న ప్యాడ్ విసిరేశాడు. ప్యాడ్ నేరుగా హుజయఫా బుగ్గను తాకింది. దీనితో ప్యాడ్‌కున్న లోహపు క్లిప్ హజయుఫా దవడలోకి దిగిపోయింది. తీవ్రంగా గాయపడిన అతడిని అలాగే ఇంటికి పంపించేశారు. రక్తమోడుతున్న గాయంతో ఇంటికి వెళ్లిన హుజయఫాకు తల్లిదండ్రులు స్థానికంగా ప్రాథమిక వైద్యం చేయించి, అనంతరం రాజమహేంద్రవరం తరలించారు. చికిత్స అందించిన వైద్యులు దవడకు లోపలివైపు కూడా గాయం తీవ్రత ఉండటంతో హుజయఫా ఆరు నెలల పాటు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు స్థానికులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం స్కూలు యాజమాన్యాన్ని ఈ విషయమై నిలదీశారు. కొందరు నేతల మధ్యవర్తిత్వంతో ఎటువంటి కేసు లేకుండా యాజమాన్యం రాజీ ప్రయత్నాలు సాగించింది. కాగా విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం డివైఇఒ నాగేశ్వరరావు పాఠశాలకు చేరుకుని ఘటనపై విచారణ జరిపారు. కాగా ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తామని డివైఇఒ నాగేశ్వరరావు మీడియాకు తెలిపారు. అయితే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడిని సస్పెండ్ ఎలా చేస్తారని, యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా యాజమాన్యంపై తాము చర్య తీసుకోలేమని తెలపడం విశేషం. ఇదిలావుండగా విషయం తెలుసుకుని మీడియా ప్రతినిధులు పాఠశాల వద్దకు వెళ్లినపుడు వారిపై యాజమాన్యం విరుచుకుపడింది.