ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్‌పరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 16: జిల్లా కేంద్రాల్లోని పలు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న ఆలోచలో ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం చిత్తూరు ప్రధాన ఆసుపత్రిలో జరిగిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో మంత్రి పాలుపంచుకున్నారు. ఈసందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ వైద్య కళాశాలలు ఏర్పాటుచేసే ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తే రాష్టవ్య్రాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఎనిమిది ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలను వారికి అప్పగించే అలోచనలో ఉన్నామన్నారు. దీనివల్ల ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందడంతో పాటు ఆసుపత్రులకు అనేక వౌలిక సదుపాయాలు, అధునాతన వైద్య పరికారాలు అందుబాటులోకి రావడం, అనేకమందికి మెడికల్ సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం జనాభాకు అనుగుణంగా డాక్టర్లు లేరని, దీంతో అధిక సంఖ్యలో డాక్టర్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. అయితే ఈ ఆసుపత్రుల వ్యవహారాలన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. ఇందులో ఎటువంటి అపోహలకు తావులేదన్నారు. ప్రస్తుతం చిత్తూరు ఆసుపత్రిని అపోలో సంస్థకు ఇచ్చామని, దీంతో ఆసుపత్రికి అదనంగా అనేక సౌకర్యాలు కలగడంతో పాటు ఇటీవల ఈ సంస్థకు చెందిన కాలేజీకి 150 మెడికల్ సీట్లు మంజూరు అయితే అందులో 75 సీట్లు పేద విద్యార్థులకు అందే ఆవకాశం లభించిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ మెరుగైన వైద్యం అందుతున్నందు వల్లనే ఓపి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నదన్నారు. ఆసుపత్రులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం వల్లనే అనేక లాభాలు ఉన్నాయన్నారు. వైద్యసిబ్బంది పెరగడం, అత్యంత ఆధునాత పద్ధతులతో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించవచ్చునని తెలిపారు. దీనివల్ల రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులే ఉండవన్న అపోహలు పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు మంచి వైద్యం అందిచాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.