ఆంధ్రప్రదేశ్‌

16 ఎకరాలపై మాఫియా పడగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 16: విశాఖ మాదిరిగా రాజమహేంద్రవరంలో కూడా ఒక భూ కుంభకోణం బయటపడింది..ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించడంతో రూ. కోట్ల విలువ చేసే ఈ భూమి కబ్జా కోరల్లోంచి బయట పడింది.
రాజమహేంద్రవరంలో భారీ భూ కుంభకోణం జిల్లా కలెక్టర్ చొరవతో వెలుగులోకి వచ్చింది..్భమికి వారసత్వ హక్కు కలిగిన ఆసామి ఒంటరిగా ఉండటంతో ఎవరూ రారని పసిగట్టిన కొంత మంది ముఠా, కొంత మంది రెవెన్యూ సిబ్బంది సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించి భారీ కబ్జాకు పాల్పడిన వైనం ఇది.
రాజమహేంద్రవరంలోని పదహారవ జాతీయ రహదారిని ఆనుకుని రాజమహేంద్రవరం అర్బన్ మండలం పరిధిలో 16 ఎకరాల భూమి విలువ దాదాపు రూ.100 కోట్లు ఉండవచ్చని అంచనా. అత్యంత ఖరీదైన ఈ భూమిని కాజేసేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో చివరి నిముషంలో బయటపడింది. రాజమహేంద్రవరం అర్బన్ మండలం పరిధిలో ఆర్‌ఎస్ నెంబర్ 415-2బి2లో 16 ఎకరాల భూమి కంచుమర్తి పార్ధసారధి అనే ఆసామికి పిల్లలు లేకపోవడంతో సిహెచ్ సరోజిని అనే ఆమెను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు. ఈ జమీందారుకున్న ఆస్తిలో ఈ 16 ఎకరాలు దత్తత కుమార్తె అంటే సరోజిని పేరున రాశారు. అయితే సరోజిని పాస్ పుస్తకాల కోసం రెవెన్యూ సిబ్బంది చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఈ ఆస్తిపై కొంత మంది కన్నుపడింది. అంతే కొంత మంది రెవెన్యూ సిబ్బందితో పావులు కదిపి భూమిని కాజేసేందుకు పథకం పన్నారు. విజయవాడకు చెందిన ముఠా, కొంత మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలసి పాస్ పుస్తకాల కుట్ర మొదలు పెట్టారని తెలిసింది. దీంతో కోట్ల విలువైన ఈ భూమి చేతులు మారింది. దీంతో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
న్యాయ స్థానం బాధితురాలు పెట్టిన కేసుపై తీర్పు ఇస్తూ సిబిఐ విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ విచారణ ఆరంభించారు. ఈ విచారణలో నకిలీ పత్రాలు సృష్టించినట్టు ధ్రువీకరణ జరగడంతో కబ్జాకు పాల్పడిన వారి పేరిట వున్న పాస్ పుస్తకాలను రద్దు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అప్పటి అర్బన్ ఎమ్మార్వో బొమ్మూరు పిఎస్‌లో కబ్జాకు పాల్పడినవారిపై ఫిర్యాదు చేశారు. దీంతో బొమ్మూరు పోలీసులు కబ్జాదారులపై కేసు నమోదు చేశారు. ఈ నేపధ్యంలో బొమ్మూరు పిఎస్‌లో కేసు నెంబర్ 194-2017 విజయవాడకు చెందిన వెలుగుబంటి హరిబాబు తదితరులపై నమోదైందని తెలిసింది. ఇదే వ్యవహారంపై నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై గతంలోనే బొమ్మూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో 353-2015 కేసు నమోదైందని తెలుస్తోంది. అయితే అప్పట్లో ఆయన సమీప బంధువు అదే స్టేషన్‌లో అధికారిగా ఉండటంతో కబ్జాదారులకు కొమ్ము కాశారని అప్పటి పోలీసు అధికారి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. అనంతర పరిణామాల్లో రెవెన్యూ ఉన్నతాధికారుల విచారణలో హరిబాబు అనేక వ్యక్తి భూ కబ్జా నేరాలకు సిఐ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు గుర్తించి సదరు పోలీసు అధికారిని కూడా విఆర్‌లో పెట్టినట్టు తెలిసింది. ఈ భూ కుంభకోణంలో పాత్ర వహించిన రెవెన్యూ సిబ్బందిపై శాఖాపరమైన దర్యాప్తు జరుగుతోందని తెలిసింది. రెవెన్యూ రికార్డులు తారుమారుకు పాల్పడిన రెవెన్యూ సిబ్బందిపై ఇంకా చర్యలు చేపట్టకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసుపై మొత్తం విచారణ జరిపిస్తే మరిన్ని వ్యవహారాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది. ఇదే ముఠా విశాఖ, కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా పలు కబ్జాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ భూ కుంభకోణంపై సిబిఐ విచారణ తక్షణం చేపడితే మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. హరిబాబు నకిలీ రికార్డులు సృష్టించినట్టు ఫోరెన్సిక్ రిపోర్టులో కూడా తేలిందంటున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారై బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ కేసులో హరిబాబును పట్టుకుంటే ఒంగోలు, అనకాపల్లి తదితర చోట్ల అనేక భూ కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని తెలిసింది. చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా బయటపడతారనే ఉద్ధేశ్యంతోనే విచారణ ముందుకెళ్లడం లేదని తెలుస్తోంది.