ఆంధ్రప్రదేశ్‌

మోదీ మాటలకు, చేతలకు పొంతనలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 16: ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలు, ఉపన్యాసాలకు, మూడేళ్ల ఆయన పాలనకూ ఏమాత్రం సంబంధం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. ఆనాటి మోదీకి, ఈనాటి మోదీకి వౌఖికమైన ముఖ తేడా తప్ప మేకవనె్న పులిలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతోన్మాద, ఆర్థిక అరాచకాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. నగరంలో పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంక్‌లో ఉన్న నల్లధనాన్ని వెనక్కు తెస్తామని వాగ్దానం చేసిన మోదీ ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పనామా పేపర్ల పరంగా 500 మంది బ్యాంకు రుణాల ఎగవేతదారుల పేర్లను కూడా బహిర్గతం చేసేందుకు సిద్ధంగా లేరన్నారు. దేశానికి ద్రోహం చేసిన ఆర్థిక నేరస్తుల పేర్లను గోప్యంగా ఉంచి, వేలల్లో అప్పులు తీసుకున్న రైతుల పేర్లను మాత్రం ఎగవేతదారులుగా పేర్కొంటూ బ్యాంకుల నోటీసు బోర్డులో పెడతారా? అంటూ నిలదీశారు. మోదీ పూర్వజన్మ సుకృతం వల్లే పెద్దనోట్ల రద్దుపై ప్రజల నుంచి తిరుగుబాటు రాలేదని వ్యాఖ్యానించారు. ‘కొన్నాళ్లు ఇబ్బందులుంటాయి.. సహకరించండి’ అంటూ మతాన్ని సెంటిమెంట్‌గా ఉపయోగించుకోవడంలో మోదీ విజయం సాధించారన్నారు. నల్లధనం వెలికితీయటంతోపాటు సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు రద్దు చేశామని చెప్పిన పెద్దనోట్లు కూడా తెల్లధనంగా బ్యాంకులకు చేరిపోయిందని విమర్శించారు. 21 లక్షల కోట్లలో 96 శాతం నగదు బ్యాంకుల్లో జమ అయినందున నల్లధనం కూడా తెల్లధనంగా మారిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోదీకి కరసేవ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సదావర్తి ట్రస్ట్ భూములపై మాట్లాడుతూ ఎంతో విలువైన ఈ భూముల్లో 400 ఎకరాలకుగాను 83 ఎకరాలు మాత్రమే మిగిలాయన్నారు. తాజాగా వీటిని తమిళనాడు ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించిందన్నారు. వీటిని కాపాడుకోడానికి ప్రభుత్వం తక్షణమే అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ‘మూడేళ్ల మోదీ బండారం’ పేరిట చిరు పుస్తకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌తో కలిసి ఆవిష్కరించారు.