ఆంధ్రప్రదేశ్‌

మోదీ ప్రభుత్వానికి ఇద్దరు చంద్రుల కరసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 17 : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కర సేవ చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. అనంతపురం నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం నారాయణ ఆ పార్టీ ఏపి రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
ఏపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణలో సిఎం కె.చంద్రశేఖర్‌రావు ఆయా రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించారని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రధాని కాళ్లు పట్టుకున్న ఏపి సిఎం చంద్రబాబు.. అదే ప్రధాని అమరావతికి వస్తే విమర్శించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రూ. 16వేల కోట్లు రావాలంటూ చంద్రబాబు, తెలంగాణ లో తాము చేపట్టిన జల ప్రాజెక్టులపై కేంద్రం పన్ను విధిస్తోందంటూ కెసిఆర్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. వీరిద్దరూ ఆయా రాష్ట్రాల ప్రయోజనాల కోసం న్యాయ పోరా టం చేయడం లేదని, మీరు రాజకీయ బానిసలుగా మారొద్దని హితవు పలికారు. ఇక ప్రధా ని నరేంద్ర మోదీ సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. గడచిన మూడేళ్లలో కార్పొరేట్ వర్గాలకు రూ. 13.5 లక్షల కోట్లు రాయితీల రూపంలో దోచి పెట్టారని ఆరోపించారు. ఆస్ట్రేలియాలో రూ. 5వేల కోట్ల మైనింగ్ కాంట్రాక్టును అదానీకి ఇప్పించారన్నారు. స్విస్ బ్యాంకులో దాచిన నల్లధనాన్ని వెనక్కు తీసుకు రావడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకూ దేశ వ్యాప్తంగా సిపిఐ ప్రచార ఆందోళనలు చేపడుతుందని తెలిపారు. ఇక ఏపిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి సినీ దర్శకుడు రాజవౌళిని సంప్రదించాలని సిఎం చంద్రబాబు సూచించడం హాస్యాస్పదమన్నారు. స్వదేశంలో ఉన్న అత్యంత నైపు ణ్యం కలిగిన ఇంజినీర్లను అవమానపరుస్తూ, విదేశీ ఇంజినీరింగ్ నిపుణులను సంప్రదించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. శనివారం ఒక్కరోజే అనంతపురం జిల్లాలో ఇద్దరు రైతులు అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. తమ ప్రభుత్వం రైతులను ఆదుకుంటోందని చెబుతున్న చంద్రబాబు దీనిపై ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా గంగపర్రులో దళితుల సాంఘిక బహష్కరణ జరిగితే, అక్కడికెళ్లి పరామర్శించడానికి తీరిక లేదా? అన్నా రు. ఈ నెల 30వ తేదీ లోపు అక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోతే విద్యార్థి సంఘాలు, వామపక్షాలు విగ్రహం ఏర్పాటుకు పూనుకుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.