ఆంధ్రప్రదేశ్‌

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, సెప్టెంబర్ 17: రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు జెఎసి కృషి చేస్తోందని ఎపిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్షుడు, జెఎసి చైర్మన్ పి.అశోక్‌బాబు అన్నారు. ఆదివారం ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3.86 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 1.86 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, మరో లక్షమంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారన్నారు. వీరిలో జీతాలు చాలక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే.. జీతాలు ఎక్కువ పొంద డం వల్ల ఆదాయపన్నుశాఖకు తమ జీతాలు పోతున్నాయని మరికొంత మంది గగ్గోలు పెడుతున్నారన్నారు. కేవలం 8 నెలల జీతం మాత్రమే పొందుతున్నామని, నాలుగు నెలల జీతం ఆదాయ పన్నుకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. సిపిఎస్ విధానంలో పనిచేస్తున్న వారు సిపిఎస్ విధానం వద్దని పాత పింఛను విధానం కావాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇక కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారు తమకు జీతాలు పెంచితే చాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల పంజాబ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులు 30వేల మందిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయగా, అక్కడ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిపై నోటిఫికేషన్ ఇచ్చి రెగ్యులర్ ఎలా చేశారని హైకోర్టు ప్రశ్నించిందన్నారు. ఈ విషయం సున్నితమైనదని ఎన్నికలు సమీపిస్తున్నందున కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన వారికి తాము మద్దతునిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ఒక్క కాశ్మీర్‌లోనే కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసిన వారికి రెగ్యులరైజ్ చేయవచ్చని చట్టంలో ఉందన్నారు. మిగిలిన రాష్ట్రాలకు ఇది వర్తించడం లేదన్నారు. ఏది ఏమైనప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, వారికి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామన్నారు. అలాగే కాంట్రాక్ట్ పద్ధతి లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు జీతం తో కూడిన మేటర్నిటీ సెలవు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలిపారు. రాష్ట్ర జెఎసి ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పురుషోత్తం నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డివి రమణ, జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న జెఎసి చైర్మన్ అశోక్‌బాబు