ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎమ్మెల్యే అన్నాకు రెండేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, సెప్టెంబర్ 18: ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబుకు రెండేళ్లు జైలుశిక్ష విధిస్తూ మార్కాపురం ఫస్ట్‌క్లాస్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ పఠాన్ సియాజ్‌ఖాన్ తీర్పు చెప్పారు. 2008 ఆగస్టు 11వ తేదిన ఓ భూ వివాదంలో అప్పటి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పట్టణానికి చెందిన గోళ్ల సురేంద్రనాథ్ ఇంటికి వచ్చి మహిళలను దుర్భాషలాడారంటూ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో పట్టణ పోలీసులు 452, 506, 509 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే 2008 ఆగస్టు 23న ఈ కేసు తప్పుడు కేసు అంటూ పోలీసులు తొలగించారు. దీనిపై సురేంద్రనాథ్ మార్కాపురం మొదటి తరగతి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. ఈ వివాదం దేవరాజుగట్టు సమీపంలో ఉన్న 29 ఎకరాల భూమిలో 2007 నవంబర్ 26వ తేదిన కొంత భూమిని అన్నా రాంబాబుకు విక్రయించడం జరిగింది. అయితే మిగతా భూమిని కూడా తనకే అమ్మాలంటూ బెదిరించారని, తాను ఇంట్లో లేని సమయంలో మహిళలను కూడా బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారించిన ఎడిఎం కోర్టు మేజిస్ట్రేట్ నేరం జరిగినట్లు గుర్తించి రెండేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.