ఆంధ్రప్రదేశ్‌

కాక్‌పిట్ తలుపును తాకిన నార్వే దేశస్థుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుకొండ, సెప్టెంబర్ 18: విమానంలో టాయ్‌లెట్ తలుపు అనుకుని పొరపాటుగా పైలెట్ ఉండే కాక్‌పిట్ తలుపును నార్వే దేశస్థుడొకరు తాకడం సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో గందరగోళం సృష్టించింది. హైజాకర్ అనే సందేహంతో కొద్దిసేపు అతడిని అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం వదిలిపెట్టారు. నార్వే దేశానికి చెందిన విచిత్ టామ్ రికాడ్ సోమవారం హైదరాబాద్ వచ్చాడు. అక్కడి నుండి అతను జెట్ ఎయిర్‌వేస్ విమానంలో రాజమహేంద్రవరం బయలుదేరాడు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో టాయ్‌లెట్‌కు వెళ్లాలని భావించిన టామ్ పైలెట్ ఉండే కాక్‌పిట్ డోర్‌ను తాకాడు. దీంతో చెన్నై, హైదరాబాద్‌కు సిగ్నల్ వెళ్లింది. ఈలోగా పైలెట్ హైజాకర్ అనుకుని జెట్ ఎయిర్‌వేస్ సిబ్బందిని అప్రమత్తం చేశాడు. దీంతో విమానంలోని సిబ్బంది అతడిని ఏం కావాలని సిబ్బంది అడిగారు. తాను టాయ్‌లెట్‌కు వెళ్లాలని తెలపడంతో సిబ్బంది తీసుకెళ్లారు. తిరిగి అతడిని తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టారు. విమానం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక, ఎయిర్ పోర్టు ప్రత్యేక రక్షక దళం టామ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అంతర్జాతీయ విమానాల్లో రెండు వైపులా టాయ్‌లెట్లు ఉంటాయని, తాను టాయ్‌లెట్ అనుకుని కాక్‌పిట్ డోర్‌ను తాకానని టామ్ వివరణ ఇచ్చాడు. తాను కాకినాడలో ఓరియంట్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బోట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నానని, అప్పాయింట్‌మెంట్ ఆర్డర్ చూపించాడు. అతని వీసా, పాస్‌పోర్టు, అప్పాయింట్‌మెంట్ ఆర్డర్ తదితర పత్రాలను ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో విమానాశ్రయ అధికారులు పరిశీలించారు. మద్యం మత్తులో ఉండటం వల్ల పైలెట్ వెనుక వైపు ఉన్న కాక్‌పిట్‌ను అనుకోకుండా తాకాడని కమిటీ నిర్ధారించి, రాత్రి 11 గంటల సమయంలో అతనిని వదిలిపెట్టారు. అంతకుముందు టామ్‌తోపాటు వచ్చిన నార్వే ప్రయాణికుల రికార్డులు కూడా కమిటీ సభ్యులు పరిశీలించి, వారిని వదిలిపెట్టారు. పైలెట్ కంప్లయింట్ ఇవ్వకపోవడంతో టామ్‌ను అరెస్టు చేయలేదని సమాచారం.

చిత్రం..నార్వే ప్రయాణికుడు టామ్