ఆంధ్రప్రదేశ్‌

పిఆర్‌సి, పదవీ విరమణ వయసు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఉద్యోగులపై గిరిజన సంక్షేమ శాఖామంత్రి నక్కా ఆనంద్‌బాబు వరాలజల్లు కురిపించారు. జిసిసి 60 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా నగరంలో వుడా చిల్డ్రన్ థియేటర్‌లో సోమవారం నిర్వహించిన గిరిజన కుటుంబాల ఆత్మీయ సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు వేతన సవరణ (పిఆర్‌సి)ని అమలు చేయడంలో భాగంగా 43 శాతం ఫిట్‌మెంట్‌ను ఇస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగుల పదవీ విరమణను 58 ఏళ్ళ నుంచి 60కి పెంచామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.5,500ల నుంచి 12వేలకు పెంచామన్నారు. అరకు ఆదీవాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి అక్కడి మహిళా కార్మికులు కోరిన మీదట కనీస వేతనాన్ని మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచామన్నారు. ముఖ్యమంత్రి గిరిజనుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారనడానికి వారి సమస్యల పరిష్కారమే కారణంగా పేర్కొన్నారు. జిసిసి సంస్థ కార్మిక సంఘాలు, గిరిజన ఉద్యోగులు తమ దృష్టికి తీసుకు వచ్చిన హౌసింగ్ రుణాలు, హెల్త్‌కార్డులు వంటి వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామన్నారు. అరకుకాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. జిసిసి తేనె, అరకుకాఫీకి ఎంతో ఆదరణ ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందాయన్నారు. వ్యాపారపరంగా కాకుండా గిరిజన సంక్షేమం కోసమే సంస్థను వృద్ధి చేస్తూ ముందంజలో నిలపాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందులోభాగంగా జిసిసి కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో దింపిందన్నారు. నన్నారి టెట్రాప్యాక్, త్రిఫల షర్బత్‌లున్నాయన్నారు.
ఇవి కాకుండా రానున్న డిసెంబర్‌లో అరకు ఇన్సటెంట్ కాఫీని మార్కెట్‌లో విడుదల చేస్తామన్నారు. దాదాపు వార్షిక వ్యాపార లక్ష్యాలను ఈ ఏడాది రూ.350 కోట్లకు చేరనుందన్నారు. అనేక రకాలైన కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సంస్థ ఎండి రవిప్రకాష్ కృషితో గిరిజనులకు మరింత మేలు జరుగుతుందన్నారు.