ఆంధ్రప్రదేశ్‌

కంచ ఐలయ్యపై సిఐడి కేసు నమోదు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. వైశ్యవర్గంపై ఐలయ్య రచించిన పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తమ వర్గాన్ని కించపరిచేలా రచనలు ఉన్నాయంటూ వైశ్యులు తీవ్ర ఆందోళనలు కొనసాగిస్తున్న నేపధ్యంలో ఐలయ్యపై కేసు నమోదు చేయాల్సిందిగా సిఐడి పోలీసులను డిజిపి నండూరి సాంబశివరావు ఆదేశించారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాసి కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిజిపి స్పందించారు. ఐలయ్య రాసిన పుస్తకం వివాదాస్పదమైన నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆర్యవైశ్యలు రాష్టవ్య్రాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా డిజిపి సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో డిజిపి, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పుస్తకంపై కొనసాగుతున్న వివాదంపై సమగ్రంగా చర్చించారు. సమాజంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో ఐలయ్యపై కేసు నమోదు చేయాలని డిజిపి సిఐడికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో కర్నూలు నుంచి సిఐడికి ఫిర్యాదు అందింది. ఆర్యవైశ్య సంఘాలకు చెందిన ప్రతినిధి జయంతి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు ఐలయ్యపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే సిఐడి వర్గాలు మాత్రం దాటవేస్తూ ధృవీకరించకపోవడం గమనార్హం.