ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికీ ఒకరోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ప్రతి జిల్లాలో సంయుక్త సిబ్బంది మండలి సమావేశం ఏర్పాటుచేసి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశింది. అది ఆలస్యమైన పక్షంలో ఆయా జిల్లా కలెక్టర్లు నెలకొకసారి గుర్తింపు పొందిన ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్‌లతో కలిపి ‘ఉద్యోగుల గ్రీవెన్స్ డే’ నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించాలని మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సందర్భంగా ఏపి జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ ఈ విషయంలో తమ విజ్ఞప్తిని మన్నించిన సిఎస్ దినేష్‌కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దీని ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న 10లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవడమే కాకుండా ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఏపి జెఎసి అమరావతి చైర్మన్, ప్రధాన కార్యదర్శులు.. అన్ని గుర్తింపు సంఘాలను కలుపుకుని తమ జిల్లా కలెక్టర్లను కలిసి సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.