ఆంధ్రప్రదేశ్‌

అంబేద్కర్ స్మృతివనానికి డిజైన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 19: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసే క్రమంలోనే రాజధానిలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేస్తున్నట్లు గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. నవ్యాంధ్ర రాజధానిలో 125 అడుగుల భారీ విగ్రహంతో పాటు అంబేద్కర్ పేరిట స్మృతివనాన్ని ఏడాదిలోపు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో మేధావులు, ఇతర సంఘాల ప్రతినిధుల సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్టు మంత్రి తెలిపారు. మంగళవారం గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. సాంఘిక సంక్షేమశాఖ సంచాలకులు రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి నక్కా మాట్లాడుతూ ఆయన అంబేద్కర్ 125వ జయంతి వేడుకల నేపథ్యంలో భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి వచ్చే సూచనలు, సలహాలను క్రోఢీకరించి ప్రపంచంలోనే ఉత్తమ ప్రమాణాలతో స్మృతివనాన్ని తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్మృతివనం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసే క్రమంలో ఇకపై వారానికో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరుపుతారని వివరించారు. సోమవారం పోలవరంపై, ఆదివారం అంబేద్కర్ వనంపై సమీక్ష జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ మాట్లాడుతూ స్మృతివనం నిర్మాణానికి ఇప్పటి వరకు ప్రభుత్వం 300 కోట్ల నిధులు కేటాయించిందని, 20 ఎకరాల విస్తీర్ణంలో స్మృతివనం ఏర్పాటవుతుందని తెలిపారు. గుంటూరు కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటులో తాను ఓ భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా స్మృతివనం ఏర్పాటుకు వివిధ సంస్థ లు రూపొందించిన నాలుగు నమూనాలను ప్రతినిధులు పవర్ పాయిం ట్ ప్రజంటేషన్ ద్వారా వివరించా రు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్, సంధ్యారాణి, ఎమ్మెల్యేలు రావెల కిషోర్‌బాబు, అనిత, రాష్ట్ర ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, ఆహార కమిటీ చైర్మన్ జెఆర్ పుష్పరాజ్, బాపట్ల ఎంపి శ్రీరాం మాల్యాద్రి, ఏపిఐఐసి చైర్మన్ కృష్ణయ్య, మాధవరావు, గోపాలరావు, డిసి రోశయ్య, తదితరులు ప్రసంగించారు.

చిత్రం..మేధావుల సూచనల స్వీకరణ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న మంత్రి