ఆంధ్రప్రదేశ్‌

నాయుడుపేట కమిషనర్ నివాసాల్లో ఏసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/నాయుడుపేట, సెప్టెంబర్ 19: నెల్లూరు జిల్లా నాయుడుపేట నగర పంచాయతీ కమిషనర్ అవినేని ప్రసాద్ నివాసాలు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో మంగళవారం ఏకకాలంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. నెల్లూరు, నాయుడుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, కడప, కడప జిల్లా రాజంపేట ప్రాం తాల్లో ఎసిబి అధికారులు దాడులు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఎసిబి డిఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి కపిలతీర్థంలోని ప్రసాద్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కమిషనర్ ప్రసాద్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతిలోని ఐదంతస్థుల భవనం ఆయన తల్లి పేరు మీద ఉందని, ఇది కాకుండా చెన్నకేశవపురం వద్ద 40 సెంట్లు, తిరుపతి సమీపంలోని అక్కారంపల్లి వద్ద 40 సెంట్లు, తిమ్మినాయుడు పాళ్యెం వద్ద 2 అపార్ట్‌మెంట్‌లు, గాజులమండ్యం వద్ద ఒక ఎకరా భూమి, ఆయన పేరు మీద ఒక వాహనం ఉన్నట్లు గుర్తించామన్నారు. మధ్యాహ్నం వరకు దాదాపు రూ.5 కోట్లు విలువైన అక్రమ ఆస్తులు గుర్తించడం జరిగిందని తెలిపారు. అలాగే ఎసిబి సిఐ విజయ్‌శేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది శ్రీకాళహస్తి పట్టణంలోని సన్నిధివీధిలో ఉన్న రెండంతస్థుల భవనం లో మంగళవారం ఉదయం 6.30 నుంచి 12 గంటల వరకు దాడులు నిర్వహించారు. అనంతరం సిఐ విలేఖరులతో మాట్లాడుతూ ఇంటిలో అదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన పత్రాలు కాని, నగలు, నగదు ఏమీ లభించలేదని చెప్పారు. ఈవిషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట కమిషనర్ కార్యాలయంలో గుంటూరు రేంజి ఇన్‌స్పెక్టర్ టివివి ప్రతాప్‌కుమార్ రికార్డులు స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహించారు. కమిషనర్ కుమా ర్తె నివాసం ఉంటు న్న నెల్లూరులోని రాంజీనగర్‌లో ఒంగోలు ఎసిబి సిఐ సంజీవ్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు.