ఆంధ్రప్రదేశ్‌

చల్ల చల్లగా ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: జనరల్ కోచ్‌ల్లో ప్రయాణించే వారికి ఇక నుంచి చల్లదనం అందనుంది. ఏసి కోచ్‌ల్లో మాదిరి ప్రయాణించే సౌలభ్యం త్వరలో వీరికి అందుబాటులోకి రానుంది. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా రైళ్ళల్లోను, ప్లాట్‌ఫారాలపై కల్పించాల్సిన సదుపాయాలు, రైల్వే అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై భారతీయరైల్వే ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న 16 రైల్వేజోన్లు, దాదాపు 50 డివిజన్లకు సంబంధించి రైల్వేస్టేషన్లు, రైళ్ళల్లో ప్రయాణించే వారి నుంచి అభిప్రాయాలను సేకరించి వీటన్నింటిని ప్రతిపాదనల రూపంలో పంపాల్సిందిగా డివిజన్, జోన్ అధికారులకు రైల్వే సూచించింది. వాల్తేరు డివిజన్ చేపట్టిన అభిప్రాయ సేకరణ, ప్రత్యేక సర్వేలో జనరల్ కోచ్‌లకు సంబంధించి చల్లదనం కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయనేది స్పష్టమైంది. దీనివల్ల బహుళ ప్రయోజనాలు కల్పించుకున్నట్టు అవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
జనరల్ కోచ్‌లకు ‘ఎయిర్ కూల్డ్ ప్లాంట్’ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు చల్లదనంతో ప్రయాణించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే చలికాలంలో అయితే హీటర్‌గాను ఇది ఉపయోగపడుతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే జనరల్ కోచ్‌లు ఎపుడూ పరిశుభ్రంగా ఉంటాయి. టాయ్‌లెట్లల ద్వారా అక్రమ సరకు రవాణాకు అవకాశమే ఉండదు. పొగతాగే ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోతారు. పర్యావరణ పరిరక్షణ అనేది పటిష్ఠంగా అమలయ్యే అవకాశాలుంటాయి. సాధారణ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా జనరల్ కోచ్‌ల్లో ఉండే నాలుగు టాయ్‌లెట్లలో కేవలం ఒక టాయ్‌లెట్‌ను తొలగిస్తే సరిపోతుంది. దీనికి ఎయిర్ కూల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. కోచ్‌ల్లో టాయ్‌లెట్లకు ఎలాగూ నీటి సరఫరా ఉంటుంది. అందువల్ల ఎయిర్ కూల్డ్ ప్లాంట్‌కు నీటి సదుపాయాన్ని ప్రత్యేకించి కల్పించనవసరం లేదు. ఇక కోచ్ లోపలి పైభాగంలో పైపులైను ఆధారంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎయిర్ కూల్డ్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే జనరల్ కోచ్‌ల్లో ప్రయాణికులంతా చల్లదనంతో ప్రయాణించే సౌలభ్యం కలుగుతుంది. దీనివల్ల ఏసి ప్రయాణికుల మాదిరి తాము కారుచౌక ప్రయాణంతో ఏసిని పొందగలుగుతున్నామనే భావన కల్పించవచ్చనేది రైల్వే ఆలోచన. ఇటువంటి సరికొత్త విధానంతో ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు సామాన్య ప్రయాణికులకు రైల్వేపట్ల విశ్వాసం పెరుగుతుంది. ఒక జనరల్ కోచ్‌లో ఉండే నాలుగు టాయ్‌లెట్స్‌లో ఒకే ఒక టాయిలెట్‌ను తొలగించడం ద్వారా ఎయిర్ కూల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుండగా, దీని ఏర్పాటుకు అయ్యే ఖర్చు అతి స్వల్పమే అనేది తేలిపోయింది. రైల్వేలో మెకానికల్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులను సైతం విస్మయం పర్చే ఈ ప్లాంట్‌కు అవసరమైన పరికరాలు, నీటి సదుపాయం, పైపులైను మార్గం ఏర్పాటుకు మొత్తం మీద రెండు లక్షలకు మించదనేది డివిజన్ అధికారులు లెక్కలు కట్టారు. జోన్, లేదా డివిజన్ స్థాయిలో చూస్తే మొత్తం జనరల్ కోచ్‌లకు అన్నింటికీ ఓ భారీ ప్రాజెక్టుగా తీసుకుంటే ఇది కూడా ఇంకా తగ్గిపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఎక్స్‌ప్రెస్‌లో కనీసం నాలుగు జనరల్ కోచ్‌లుంటాయి. వీటిలో రెండు రైలింజన్ వెనుక భాగంలోను, మిగిలిన రెండు గార్డు వెనుకభాగంలో ఉంటాయి. ఈ విధంగా ఒక్కో జనరల్ కోచ్‌లో ఒక టాయిలెట్‌ను తొలగించడం ద్వారా ఎయిర్ కూల్డ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఈ విధంగా ఒక్క వాల్తేరు డివిజన్ పరిదిలోనే దాదాపుగా 130 ఎక్స్‌ప్రెస్, సూపర్‌పాస్ట్, పాసింజర్ రైళ్ళు నడుస్తున్నాయి. ఇందులో సగం రైళ్ళల్లో ఉండే జనరల్ కోచ్‌లకు ఎయిర్ కూల్డ్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయగలిగినా వందలాది మంది ప్రయాణికులకు చల్లదనం అందించినట్టు అవుతుంది. అలాగే చలికాలంలో కూడా వీటిని హీటర్లగా ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది.
భారతీయరైల్వేలో ఉండే ఏ ఒక్క రైల్వేజోన్, డివిజన్ నుంచి ఇటువంటి ప్రతిపాదనలు వెళ్లలేదు. ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ నుంచి మాత్రమే వెళ్ళిన ఈ ప్రతిపాదనలపట్ల రైల్వే సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. విస్మయం చెందిన రైల్వే దీనిపై ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు త్వరలో దీనికి సంబంధించిన ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఇక్కడి రైల్వే అధికారి ఒకరు ‘ఆంధ్రభూమి’కి వెల్లడించారు.