ఆంధ్రప్రదేశ్‌

రాజకీయాల్లో నిబద్ధత, నైతిక విలువలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, సెప్టెంబర్ 19: రాజకీయాల్లో నిబద్దత, నైతిక విలువలు పాటించాలని, చేసే వాటినే ప్రజలకు చెప్పాలని, అబద్దాలను ప్రజలు నమ్మరని, అబద్దాలు చెప్పే వారికి నంద్యాల ప్రజల్లా గట్టిగా బుద్ది చెబుతారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్‌యార్డులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలే తప్ప స్వార్థంతో, ఆస్తులు పెంచుకొనేందుకు రాజకీయాలు చేయరాదన్నారు. ప్రతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు అందేలా చూసేందుకు ఇంటికి పెద్ద కొడుకునై పనిచేస్తానని ముఖ్యమంత్రి అన్నారు. నీతికి, అవినీతికి జరిగిన పోరాటంలో నంద్యాల ప్రజలు నీతివంతమైన పాలన అందిస్తున్న తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారన్నారు. మూడున్నర సంవత్సరాల పాలనకు నంద్యాల ఉప ఎన్నిక అద్దం పట్టిందన్నారు. ప్రశాంత్ కిశోర్ వల్ల వైకాపా నష్టపోయిందే తప్ప లాభపడిందేమీలేదన్నారు. నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, మీరు చూపిన ఆదరణ జీవితంలో మరచిపోలేనన్నారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారన్నారు. అంతటి విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పడమేకాక ప్రారంభించిన పనుల పురోగతిని పరిశీలించేందుకు నంద్యాలకు వచ్చానన్నారు. నంద్యాల పట్టణాన్ని హెలికాప్టర్‌లోనే మూడు చుట్టేశానని, ఇక్కడ జరుగుతున్న పనులను చూశానన్నారు. కుందూ, చామకాల్వ విస్తరణ పనులు పూర్తిచేయడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు నంద్యాల పట్టణంలోకి వరద నీరు రాలేదన్నారు. అన్ని పనులు పూర్తి చేసి ఆధునిక, స్మార్ట్ నంద్యాలను చేస్తానని బాబు హామీ ఇచ్చారు. నంద్యాల నియోజకవర్గంలో 1660 కోట్ల ఖర్చుతో 285 పనులు ప్రారంభించారని, ఈ పనులనీ పూర్తయ్యేంత వరకు ప్రతి నెల నంద్యాల వస్తానన్నారు. పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ నంద్యాలను అభివృద్ధి చేయడంలో విస్మరించిందని, ప్రజలకు సేవ చేయాలనే దృక్పదం లేని నాయకుల వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. సీమలో పుట్టినవాడ్ని రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తానన్నారు. తన వల్ల అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతోనే తిరుపతి వెంకన్న తనకు ప్రాణబిక్ష పెట్టాడని, దాంతో రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుందని, ఆ ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. శ్రీశైలానికి మెల్లమెల్లగా నీరు వస్తోందని, ఆ నీటితో సీమ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.