ఆంధ్రప్రదేశ్‌

‘హేవలాక్’ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: అఖండ గోదావరి పర్యాటక కేంద్రంలో భాగంగా గోదావరికి మణిహారంగా హేవలాక్ బ్రిడ్జి పర్యాటక ప్రాజెక్టు సాకారమవుతోంది. హేవలాక్ బ్రిడ్జి పర్యాటక ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పర్యాటక ప్రాజెక్టు నిమిత్తం పర్యాటక రంగంలో అంతర్జాతీయంగా పేరున్న భారీ సంస్థలను ఆహ్వానించే విధంగా గ్లోబల్ టెండర్లు పిలవనున్నారు. మరో 15 రోజుల్లో టెండర్లను పిలిచి మరో 15 రోజుల్లోగా అంతర్జాతీయ కన్సల్టెంట్లకు పనులు అప్పగించేందుకు చర్యలు వేగవంతం చేశారు. అయితే టెండర్లు పిలిచేలోపు జెఎన్‌టియు ఇంజనీర్ల బృందం ఈ హేవలాక్ బ్రిడ్జిని పరిశీలించనుంది. బ్రిడ్జి ప్రస్తుతం ఏ స్థితిలో ఉందనే విషయాన్ని అధ్యయనం చేసి నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకున్నారు. దీనిని బట్టి ఇంజనీరింగ్ ప్రమాణాలతో మరింత వెడల్పుగా పర్యాటక అనువుగా తీర్చిదిద్దేందుకు ఈ నివేదికను బట్టి సిద్ధం చేస్తున్నారు. హేవలాక్ బ్రిడ్జి పర్యాటక ప్రాజెక్టు డిజైన్లను ఇప్పటికే ముఖ్యమంత్రి ఆమోదించారు. ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. సత్వరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు అఖండ గోదావరి పర్యాటక కేంద్రం ప్రత్యేక అధికారి జి భీమశంకరరావు చెప్పారు. ఈ బ్రిడ్జి కోసం రైల్వే శాఖకు తాజాగా రూ.13 కోట్లు చెల్లించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు పడింది. బ్రిడ్జి నాలుగు కిలో మీటర్ల మేర పొడవునా నాలుగు ప్యాకేజీలుగా పర్యాటక ప్యాకేజీగా అభివృద్ధి చేయనున్నారు. ఇందు కోసం మొత్తం రూ.100 కోట్లు వెచ్చించి పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు డిపిఆర్ రూపొందించారు. మొదటి విడత రూ. 25 కోట్ల నిధులు విడుదలయ్యాయి. రాజమహేంద్రవరం వైపు నుంచి ఒక కిలో మీటర్ మేర ఈ నిధులతో పనులు చేపట్టనున్నారు. రెండో విడత నిధులతో పశ్చిమ గోదావరి జిల్లా వైపు కొవ్వూరు నుంచి బ్రిడ్జి పనులు చేపట్టనున్నారు. ముందుగా పిపిపి విధానంలో చేపట్టేందుకు ప్రయత్నించినప్పటికీ చివరి నిముషంలో ఈ విధానాన్ని విరమించుకున్నారు. ప్రభుత్వ అధీనంలోనే పర్యాటకంగా తీర్చిదిద్ది ఆపరేషన్ అండ్ మెయింటెనె్సకు అప్పగించాలని అనుకుంటున్నారు. వందేళ్లకు పైబడిన చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఎప్పటినుంచో ప్రతిపాదించారు. ఎట్టకేలకు ఈ ప్రభుత్వ హయాంలో సాకారంలోకి వచ్చినట్టయిందంటున్నారు. 1897లో బ్రిటీష్ హయాంలో మద్రాసు ప్రభుత్వం నిర్మించింది. మూడున్నర కిలో మీటర్ల మేర 54 స్తంభాలతో హేవలాక్ బ్రిడ్జిని నిర్మించారు. 1900 సంవత్సరం ఆగస్టు 30న ఈ బ్రిడ్జి ప్రారంభమైంది. చెన్నై వెళ్ళే హౌరా రైలు ఈ వంతెనపై తొలిసారి ప్రయాణం సాగించింది. కేవలం 60 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు మాత్రమే పని చేస్తుందని ఇంజనీర్లు చెప్పగా 97 ఏళ్లపాటు నిర్విరామంగా సేవలు అందించింది. 1997 మార్చి నెలాఖరున చివరి సారిగా ఈ బ్రిడ్జిపై ఆఖరి రైలు ప్రయాణించింది. ఎట్టకేలకు రాష్ట్ర అధీనంలోకి వచ్చిన ఈ బ్రిడ్జి అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టుగా రూపుదాల్చింది. ఉభయ జిల్లాలకు అనుసంధానంగా పర్యాటక శోభతో అలరారనుంది. వినూత్న పర్యాటక విశేషాలతో ప్రాజెక్టు చేపడుతున్నారు. నైట్ బజార్, హేంగింగ్ రెస్టారెంట్లు, నడుచుకుంటూ షాపింగ్ చేసే విధంగా ఇలా రకరకాలుగా తీర్చిదిద్దేందుకు డిపిఆర్ తయారు చేశారు. దీనితో పాటు అఖండ గోదావరి పర్యాటక కేంద్రంలో భాగంగా ఈ బ్రిడ్జికి అనుసంధానంగా గోదావరి నదిలో లంక ప్రాంతాలకు వెళ్ళే విధంగా కూడా అనుసంధాన ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. మొదటి దశ పనులను ఏడాది కాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఈ పనులకు డిసెంబర్‌లో ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేయించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రూ.75 కోట్లు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నిమిత్తం రూ.25 కోట్లు మొదటి ప్యాకేజీ నిధులు, రూ.13 కోట్లు రైల్వేకు చెల్లించారు.

చిత్రాలు..రాజమహేంద్రవరంలో గోదావరిపై హేవలాక్ వంతెన
* వంతెన ప్రారంభంనాటి శిలాఫలకం