ఆంధ్రప్రదేశ్‌

జ్వరపీడిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో జ్వర పీడిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటుచేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. జ్వరాలు తీవ్రంగా ఉన్న గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెప్పారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ వాతావరణ మార్పులతో వివిధ ప్రాంతాల్లో జ్వరాలు ప్రబలడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పొరుగునున్న ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలతో పోల్చి చూస్తే రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మలేరియా, డెంగ్యూకు సంబంధించి రాష్ట్రంలో ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదని ఆయన చెప్పారు. ఒడిశాలో 22 మంది మలేరియాతో మరణించగా, కర్ణాటకలో 28 మంది, కేరళలో ఐదుగురు, మహారాష్టల్రో ముగ్గురు, తమిళనాడులో ఒకరు డెంగ్యూతో మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలను ఆయన ప్రస్తావించారు. స్వైన్ ఫ్లూతో రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 13 మంది మృతి చెందారని చెప్పారు. మలేరియా, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ తదితర జ్వరాల విషయంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. అన్ని బోధనాసుపత్రుల్లోనూ స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరికరాలను ఏర్పాటు చేశామని మంత్రి కామినేని చెప్పారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ ఎమ్మారై, సిటీ స్కాన్ పరీక్షలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకూ జిల్లా ఆసుపత్రుల్లో కొన్నిచోట్ల మాత్రమే ఎమ్మారై, సిటీ స్కాన్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. అన్నిచోట్ల ఈ సేవలు అందుబాటులో ఉండేలా టెండర్లను పిలిచామని చెప్పారు. 117 సిహెచ్‌సీల్లో టెలీ ఆప్తమాలజీ కింద వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లను ఇస్తున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అలాగే కొన్ని సిహెచ్‌సిల్లోనే అమలవుతున్న సైంటిఫిక్ శానిటేషన్‌ను అన్ని సీహెచ్‌సిల్లోనూ అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అర్బన్ హెల్త్ సెంటర్స్, అంబులెన్స్‌లు, వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన టెండర్లలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలను మంత్రి ఖండించారు. ఇవన్నీ గిట్టనివారు, అసూయతోనూ చేస్తున్న ఆరోపణలు అని అన్నారు. 222 అర్బన్ హెల్త్ సెంటర్స్‌లోనూ టెలి మెడిసిన్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. మొత్తం అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లను ఒక్కరే నిర్వహించలేరనే ఉద్దేశ్యంతోనే రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి టెండర్లను పిలిచామని చెప్పారు.