ఆంధ్రప్రదేశ్‌

క్రీడాకారులు దేశ సంపద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యవంతమైన సమాజానికి వారే పునాదిరాళ్లు

స్పీకర్ కోడెల శివప్రసాదరావు

నరసరావుపేట, సెప్టెంబర్ 20: ఆరోగ్యకరమైన సమాజానికి క్రీడాకారులే పునాదిరాళ్లని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. క్రీడాకారులను దేశ సంపదగా భావిస్తామన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 63వ రాష్టస్థ్రాయి అండర్-17 బాల బాలికల ఫుట్‌బాల్, ఫెన్సింగ్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎ భానూప్రతాప్ అధ్యక్షత వహించారు. క్రీడాకారులు ప్రతిభ, నైపుణ్యంతో పోటీ ల్లో గెలవడానికి ప్రయత్నించాలని కోడెల అన్నారు. గెలవకపోయినా ఆరోగ్యం సమకూరుతుందన్నారు. క్రీడాకారులు ఏ రం గంలోకి ప్రవేశించినా నెంబర్-1 స్థానంలో ఉండాలన్నారు. నేటి ప్రఖ్యాత క్రీడాకారు లు పివి సింధు, కరణం మల్లీశ్వరి, కస్యప్, శ్రీకాంత్, హరికృష్ణ, హారికలను ఆదర్శం గా తీసుకోవాలన్నారు. విజేతలుగా నిలవటం ద్వారా రాష్ట్రానికి మంచిపేరు తేవాలన్నారు. చైనా వంటి దేశాల్లో చిన్నతనంలోనే నైపుణ్యాన్ని గుర్తించి శిక్షణతో పాటు స్కాలర్‌షిప్‌లు అందచేస్తారని, ఇక్కడా అలాంటి ప్రోత్సా హం అవసరమన్నారు. తెలివితేటలు, దేహదారుఢ్యంతో పాటు కఠోర శ్రమ చేస్తే విజయం సిద్ధిస్తుందన్నారు.
అనంతరం జాతీయ పతాకాన్ని స్పీకర్ కోడెల ఆవిష్కరించారు. క్రీడాపతాకాన్ని జెడ్పీ సీఈవో నాగార్జునసాగర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయగుప్తా, వైస్ చైర్మన్ మీరావలి, రాష్ట్ర స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పి రవీంద్ర, ఎపి పిఇటి అసోసియేషన్ అధ్యక్షుడు కరిముల్లా చౌదరి, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం క్రీడాకారుల నుండి క్రీడావందనాన్ని స్పీకర్ కోడెల స్వీకరించారు. ఫుట్‌బాల్, ఫెన్సింగ్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. 13 జిల్లాల నుండి బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

ఎస్‌బిఐలో ‘గోల్డ్’మాల్!

బ్రాంచి మేనేజర్ మాయాజాలం జిమణప్పురంలో తనఖా
జిషేర్ మార్కెట్‌లో పెట్టుబడిజివిజయవాడలో సిఐడి విస్తృత సోదాలు

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 20: విజయవాడలోని ఎస్‌బిఐ లాకర్లలో బంగారం గోల్‌మాల్ అయింది. ఖాతాదారుల బంగారాన్ని దారిమళ్లించి ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో తనఖా పెట్టి సొమ్ము చేసుకున్న బ్రాంచి మేనేజర్ ఉదంతం తాజాగా వెలుగుచూసింది. ఖాతాదారులు తమ బంగారానికి భద్రత కోసం బ్యాంకు లాకర్లను ఆశ్రయించినా గ్యారంటీ లేకుండా పోతుందనడానికి ఇదో నిదర్శనం. కోట్లలో రుణాలు తీసుకున్న సదరు అధికారి ఆ మొత్తాన్ని షేర్ల వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడు. ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు బుధవారం విజయవాడలోని ఎస్‌బిఐ, మణప్పురం, మరో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. బ్యాంకు ఉన్నతాధికారుల కళ్లుగప్పి బంగారం దుర్వినియోగానికి పాల్పడిన బ్రాంచి మేనేజర్‌ను సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ గాయత్రినగర్‌లోని ఎస్‌బిఐ బ్రాంచిలో ఈ కుంభకోణం జరిగింది. ఇక్కడ బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్న కృష్ణచైతన్య అత్యంత చాకచక్యంగా మోసానికి పాల్పడ్డాడు. బ్యాంకు లాకర్లలోని ఖాతాదారుల బంగారాన్ని గత ఏడాదిన్నరగా దారి మళ్లిస్తున్నాడు. ఖాతాదారులు జమచేస్తున్న బంగారాన్ని అప్పుడప్పుడు టిఫిన్ క్యారియర్‌లో బ్యాంకు నుంచి బయటకు తీసుకెళ్తున్నాడు. సుమారు 3 కోట్ల రూపాయలు విలువైన 10కేజీల రెండు గ్రాముల బంగారం గోల్‌మాల్ చేశాడు. ఈ నగలను మాచవరం డౌన్‌లోని మణప్పురం, గుణదలలోని మరో మణప్పురం బ్రాంచిలతో పాటు ఐఐఎఫ్‌ఎల్ అనే ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో కుదువపెట్టాడు. ఉన్నతాధికారుల సూచ న మేరకు ఈ నెల 18న రీజనల్ మేనేజర్ ప్రకాష్ సిఐడికి ఫిర్యా దు చేశారు. దీంతో సిఐడి ఎస్పీ కాళిదాసు రంగారావు నేతృత్వంలో బుధవారం విజయవాడలోని ఎస్‌బిఐ, మణప్పురం, ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ సంస్థల్లో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో 10 కేజీల 2 గ్రాముల బంగారం, డాక్యుమెంట్లు స్వాధీ నం చేసుకున్నట్లు రంగారావు తెలిపారు. బంగా రం కుదువ పెట్టిన కృష్ణచైతన్య కోటి 98 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్నాడని, ఈ మొత్తా న్ని షేర్లలో పెట్టుబడులు పెట్టాడని, 58సార్లు బం గారం కుదువ పెట్టినట్లు సిసి కెమెరా ఫుటేజీల ద్వారా వెల్లడైందన్నారు. బ్రాంచి మేనేజర్‌ను అరెస్టు చేయడంతో పాటు, సహకరించిన మణప్పురం ఉద్యోగులైన ఫణికుమార్, దిలీప్‌లను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నేటి నుంచి శ్రీశైలంలో
శరన్నవరాత్రులు
శైలపుత్రి అలంకారంలో దర్శనమివ్వనున్న భ్రామరి
శ్రీశైలం, సెప్టెంబర్ 20 : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో గురువారం నుంచి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో తొలిరోజు శ్రీభ్రమరాంబికదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భృంగివాహన సేవ నిర్వహించనున్నట్లు ఈఓ నారాయణ భరత్‌గుప్తా తెలిపారు.
స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న
బొలెరో వాహనం
ఒక విద్యార్థి మృతి.. మరో పది మందికి గాయాలు
దువ్వూరు, సెప్టెంబర్ 20 : బొలెరో వాహనం పాఠశాల వ్యాన్‌ను ఢీకొనడంతో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో పది మంది గాయపడిన సంఘటన బుధవారం కడప జిల్లా దువ్వూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. దువ్వూరు మండల పరిధిలోని కటికపల్లె గ్రామానికి చెందిన నంద్యాల వరదారెడ్డి కుమారుడు నంద్యాల నవీన్‌కుమార్‌రెడ్డి(5) గుడిపాడు గ్రామంలోని గురుశంకరాచార్య హైస్కూల్ యుకెజి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే పాఠశాల బస్సు ఉదయం చుట్టుపక్కల గ్రామాల్లో విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు బయల్దేరింది. ఈ బస్సులోనే నవీన్‌కుమార్‌రెడ్డి ఎక్కాడు. అయితే బస్సు మీజింకాన్‌పల్లె దగ్గర వెళ్తుండగా బొలెరో వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో నవీన్‌కుమార్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలసిన వెంటనే ఆర్‌జెడి ప్రతాప్‌రెడ్డి, డిఇఓ శైలజ, తహశీల్దార్ రవిశంకర్‌రెడ్డి, గుడిపాడు సర్పంచ్ తుమ్మల వెంకటకొండారెడ్డి, చింతకుంట ఎంపిసిసి సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి సిఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ విద్యాసాగర్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే నవీన్‌కుమార్‌రెడ్డి మృతదేహాన్ని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన బాలిక మన్యం సుప్రజ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సాగర్ ఎడమ కాలువ
పనుల పరిశీలన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి కింద ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో జరుగుతున్న నాగార్జునసాగర్ ఎడవ కాలువల ఆధునికీకరణ పనులను ప్రపంచ బ్యాంక్ కన్సల్టెంట్ ఎస్‌కె జైన్, టెక్నికల్ కన్సల్టెంట్ ఆర్‌ఆర్ మోహన్ నీటి సంఘాల ప్రతినిధులు, ఎన్‌ఎస్‌పి అధికారులతో కలిసి బుధవారం మూలపాడు మేజర్ పరిధిలోని పరిటాల మైనరు మీద వీరులపాడు మండలం, జగన్నాధపురం గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు నీటి సంఘాల ప్రతినిధులతో ఆధునికీకరణ ముందు, ఆధునికీకరణ తరువాత కాలువల పరిస్థితి, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి తదితర విషయాల మీద చర్చించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ రాష్ట్ర అపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ 3వ జోన్‌లో తిరువూరు, మైలవరం, నూజివీడు, గన్నవరం, నందిగామ నియోజకవర్గాల్లో రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టును 29 నీటి సంఘాల ప్యాకేజీలుగా విభజించి 2013లో గుత్తేదారులకు అప్పగించటం జరిగిందన్నారు. నీటి సంఘాల ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి డిసెంబర్ లోపు పూర్తి చేయించుకోవాలన్నారు. టెక్నికల్ కన్సల్టెంట్ ఆర్‌ఆర్ మోహన్ మాట్లాడుతూ నీటి సంఘాల వ్యవస్థలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

నీటి సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ ఆధునికీకరణ పనుల్లో భాగంగా మైనర్, సబ్ మైనర్ కాలువల మీద పూర్తయిన జీపుట్రాకుల మీద గ్రావెల్ వేయటానికి గ్రాంటు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల డిసి చైర్మన్ దొండపాటి భాస్కరరావు, జుజ్జూరు డిసి వైస్ చైర్మన్ కాపా రాంబాబు, నీటి సంఘాల అధ్యక్షులు కాటేపల్లి నరసింహారావు, కోడెల కుటుంబరావు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కంచె ఐలయ్యపై
చర్యలు తీసుకోవాలి

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, సెప్టెంబర్ 20: సమాజంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ కంచె ఐలయ్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామీ పరిపూర్ణానంద డిమాండ్ చేశారు. హిందూత్వంపై మాట్లాడే అర్హత ఐలయ్యకు లేదని, ఆయన మతం మార్చుకున్న, మతి తప్పిన మనిషిగా మారిపోయారని విమర్శించా రు. విదేశీ కుట్రదారులకు తొత్తుగా ఐలయ్యవ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాకినాడ నగరంలోని శ్రీపీఠంలో బుధవారం స్వామీ పరిపూర్ణానంద విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక పరిశోధనా సంస్థల్లో ఐలయ్యకు సభ్యత్వం ఉందని, తక్ష ణం ఆయా సంస్థలు ఆయన సభ్యత్వాలను రద్దు చేయాలని సూచించారు. ఆయన చేస్తున్న గందరగోళమైన వ్యాఖ్యలు కుల విద్వేషాలకు కారణమవుతున్నాయని వాపోయారు. స్వదేశీ వ్యాపారులైన ఆర్యవైశ్యుల గురించి మాట్లాడుతున్న ఆయన అనేక బహుళ జాతి సంస్థలు దేశంలో చేస్తున్న వ్యాపా రం గురించి నోరు విప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆయన రాస్తున్న పుస్తకాల్లో ఎక్కడా నైతికత అనేది ఉండదని, ఆయన కళ్లు తెరిచి మాట్లాడితే సమజంసంగా ఉంటుందని సూచించారు. వైశ్యులు తమ వ్యాపారాలను కచ్చితంగా చేస్తారని, తమకు వచ్చిన లాభాల్లో 10 శాతా న్ని సమాజంలో ధర్మ కార్యాల కోసం వెచ్చిస్తుంటారని పేర్కొన్నారు. అలాంటి వాళ్లను స్మగ్లర్లుగా ఐలయ్య చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మూడుసార్లు ముచ్చట్లు

రాజధాని డిజైన్లపై బాబు-రాజవౌళి భేటీ

జిబాహ్య ఆకృతిపై చర్చలు
జిలండన్ రావాలని సినీ దర్శకునికి ఆహ్వానం
జిరాజధానిని పరిశీలించిన రాజవౌళి

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 20: బాహుబలి సినిమాతో జగద్విఖ్యాత దర్శకుల జాబితాలో చేరిన కోడూరి శ్రీశైలశ్రీ రాజవౌళి అమరావతి నిర్మాణంలో భాగస్వామి కానున్నారు. ఇప్పటికే అమరావతి నగర నిర్మాణాలకు డిజైన్లు ఇచ్చిన నార్మన్ ఫోస్టర్ సంస్థకు బాహ్య నిర్మాణ ఆకృతులపై రాజవౌళి తన సలహా, సూచనలు ఇవ్వనున్నారు. ఈమేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇక్కడ మూడుసార్లు భేటీ అయ్యారు. కలెక్టర్ల సదస్సులో బిజీగా ఉన్నప్పటికీ బాబు ఆయనతో చర్చించారు. తర్వాత రాజవౌళి ఉదయం మంత్రి నారాయణతో కలసి రాజధాని ప్రాంతాన్ని, నిర్మాణాలు చేపట్టనున్న ప్రదేశాలను పరిశీలించారు. ఐకానిక్ భవనాలకు లోకల్ ఫ్లేవర్ ఉండాలని, బాహుబలిలో అద్భుత ఆకృతులు రూపొందించిన తరహాలో బాహ్య ఆకృతి ఉండాలని బాబు భావిస్తున్నందున రాజవౌళి సహాయం కోరామని నారాయణ చెప్పారు. ఈ క్రమంలో బాబు-రాజవౌళి మధ్య మూడుసార్లు చర్చలు జరిగాయి. దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలని సీఎం కోరారు. వచ్చేనెలలో మంత్రి నారాయణ, అధికారుల బృందంతో లండన్ వెళ్లి వారికి సలహాలివ్వాలని రాజవౌళిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే, తనకు నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లు అందించిన తర్వాతనే తన అభిప్రాయం వెల్లడిస్తానని రాజవౌళి చెప్పారు. జిల్లా కలెక్టర్ల సదస్సు తొలిరోజు సమావేశం ముగిసిన తరువాత సిఎంతో రాజవౌళి మరోసారి సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా రాజధాని డిజైన్లపై చర్చించారు. అనంతరం ఆ భేటీ వివరాలను మీడియాకు మంత్రి నారాయణ వెల్లడించారు. డిజైన్లకు సంబంధించి కానె్సప్ట్ గురించి రాజవౌళి అడిగారన్నారు. ఏ కానె్సప్ట్ ఆధారంగా నార్మన్ సంస్థ డిజైన్ చేసిందో తెలుసుకున్నారన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ భవనాలను అమరావతిలో ఉండేలా సిఎం చూస్తున్నారని, ఆ విషయం ఆయనకు తెలిపారన్నారు. వివిధ దేశాలను సందర్శించిన అనుభవంతో కీలక భవనాల డిజైన్‌కు సహకరించాలని కోరినట్లు తెలిపారు. అక్టోబర్ 11న నార్మన్ ఫోస్టర్ సంస్థతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని, అనంతరం తమతో కలిసి రాజవౌళి లండన్ వస్తారని మంత్రి నారాయణ వివరించారు.